133 students enrolled in the school where the teacher was transferred – details are as follows
ఉపాధ్యాయుడు బదిలీ అయిన పాఠశాలలో చేరిన 133 మంది విద్యార్థులు – వివరాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లారు. దీంతో ఆ పాఠశాల విద్యార్థులు గురువును విడిచి ఉండలేకపోయారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో విద్యార్థులు తమ గురువు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటామని చెప్పి ఆయన బదిలీ అయిన పాఠశాలలో చేరారు. ఈ అరుదైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది.
2012-2023:
విద్యార్థుల సంఖ్య 32 నుండి 250కి
జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ‘జాజాల శ్రీనివాస్’ 2012 జులైన 13న చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా అందులో ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ స్కూల్లోని పిల్లలతో ఆ టీచర్ ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించేవారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపడంతో 32 మందిగా ఉన్న విద్యార్థుల సంఖ్య 250కి చేరింది.
2024:
పాత పాఠశాల నుండి బదిలీ అయిన పాఠశాలకి 133 మంది
దీనితో కొత్త పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 21 నుండి 154కి
ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఆయన ఈనెల 1న ఇదే మండలంలోని మూడు కిలోమీటర్ల దూరంలోని ‘అక్కపెల్లిగూడ’ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ముందు పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామాన్ని తట్టుకోలేక ఏడ్చారు. తమ మాస్టారు ఎక్కడ ఉంటే అక్కడే చేరతామని పిల్లలు గొడవ చేయడంతో 2,3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ పాఠశాలలో చేర్పించారు. దీంతో అంతకు ముందు కేవలం 21 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల నేడు 154 మందితో కళకళలాడుతోంది. కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
COMMENTS