Good news for those who have passed '10th' - thousands of rupees scholarship - applications are being accepted!
'పది' పాసైన వారికి గుడ్‌న్యూస్ - రూ.వేలల్లో స్కాలర్షిప్ - దరఖాస్తులు తీసుకుంటున్నారు!
How to Apply for Vidyadhan Scholarship: ప్రతిభ ఎంత ఉన్నా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. గొప్ప స్థితిలో ఉండాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం వారికి అడ్డుగా ఉంటోంది. అలాంటి వారికి ఉపకార వేతనాలు అందించడమే గాక ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తోంది సరోజిని దామోదరన్ సంస్థ. ప్రతీ సంవత్సరం పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు "విద్యాదాన్" పేరిట ఉపకార వేతనాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇంటర్‌తో పాటు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల ప్రతిభ, కోర్సు ప్రాతిపదికగా స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ వివరాలు..
పలు రాష్ట్రాల విద్యార్థులకు: ఈ ఫౌండేషన్ విద్యాదాన్ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, లడఖ్, పుదుచ్చేరి, దిల్లీ, బిహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుతం 8వేల మందికి స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు.
అర్హతలు:
పదో తరగతిలో 90% మార్కులతో ఉత్తీర్ణత లేదా 9 జీపీఏ సాధించిన వారు వీటిని పొందడానికి అర్హులు.
దివ్యాంగులైతే 75% మార్కులు లేదా 7.5 జీపీఏ సాధిస్తే చాలు.
అభ్యర్థుల కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి.
స్కాలర్షిప్ ఎంత: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.10,000/- స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే ప్రతిభ కనబరుస్తూ ఉన్నత చదువులకు వెళ్లే అభ్యర్థులకు ఏడాదికి రూ.10,000 నుంచి రూ.75,000 వరకు ఉపకారవేతనాలు అందిస్తారు.
కావాల్సిన పత్రాలు:
- పదోతరగతి లేదా తత్సమాన కోర్సు మార్క్స్ మెమో
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- పాస్‌ఫొటో
- ఇంటర్ కాలేజీ వివరాలు
ఎంపిక విధానం: స్కాలర్‌షిప్‌లకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మాత్రమే ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఈ-మెయిల్/ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.
ముఖ్య తేదీలు:
తెలంగాణ: స్కాలర్‌షిప్‌లకు అప్లై చేసుకునేందుకు జూన్ 15 లాస్ట్ డేట్. అలాగే జులై 7 న ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఆగష్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్: స్కాలర్‌షిప్‌లకు అప్లై చేసుకునేందుకు జూన్ 7 లాస్ట్ డేట్. అలాగే జూన్ 23 ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి జులై నెలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు విధానం:
- ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే అభ్యర్థులకు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.
- మొదట ఫౌండేషన్ వెబ్‌సైట్ www.vidyadhan.org ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో Apply for Scholarships ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో రైట్ సైడ్ కాలమ్‌లో Already Registered/ Login ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీరు అంతకుముందే రిజిష్టర్ అయితే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. లేదంటే మీరు కొత్తగా అప్లై చేసుకంటే Register ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత Register As Student ఆప్షన్‌పై క్లిక్ చేసి Register ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీ పేరు, ఈ-మెయిల్, పాస్వర్డ్ వంటి వివరాలు ఎంటర్ చేసి Register బటన్‌పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. తర్వాత ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత పదో తరగతి మార్కుల జాబితాలో ఉన్న విధంగా పేరు, చిరునామా ఆయా కాలమ్స్‌లో పూర్తిచేసి Apply Now ఆప్షన్ క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ మీరిచ్చిన వ్యక్తిగత ఈ మెయిల్‌కు వస్తుంది.
- తర్వాత అక్కడ అందించిన సూచనల ప్రకారం అప్లికేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోను అప్లోడ్ చెయ్యాలి. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. చివరిగా Submit పై క్లిక్ చేస్తే దరఖాస్తు పూర్తయినట్లే.
- విద్యాదాన్ వివరాలు ఈ-మెయిల్‌కు వస్తాయి కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
COMMENTS