Sanchar Saathi : Have you lost your cell phone..? You can easily block like this!
Sanchar Saathi : మీ సెల్‌ఫోన్ పోయిందా..? మీరే సింపుల్‌గా ఇలా బ్లాక్ చేయొచ్చు!
How To Block Stolen Phone with CEIR Sanchar Saathi : మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్స్ ఒక భాగమైపోయాయి. వీటిలో మన కాంటాక్ట్ నంబర్స్ మాత్రమే కాదు. ఎన్నో విలువైన, ఎంతో విలువలైన డేటాను కూడా సేవ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మన మొబైల్ను ఎవరైనా దొంగిలించినా.. లేదా మనమే పొరపాటున పోగొట్టుకున్నా.. తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి 'సంచార్ సాథి' ఒక సులువైన పరిష్కారం చూపిస్తోంది. ఎలాగో చూద్దాం..
సీఈఐఆర్ (CEIR) ద్వారా:
మీ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ద్వారా వెంటనే దాన్ని బ్లాక్ చేసి పనిచేయకుండా చేయవచ్చు. అంతే కాదు మీ ఫోన్ తిరిగి దొరికితే, దానిని అన్బ్లాక్ చేసుకుని వాడుకోవచ్చు. ఇందుకోసం ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఐఎంఈఐ, ఇతర వివరాలు ఇచ్చి సంచార్ సాథి వెబ్‌సైట్ https://www.sancharsaathi.gov.in/ లో ఫిర్యాదు చేయొచ్చు.
సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో 'సంచార్ సాథి' అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కనుక బాధితులు ఎవరైనా https://www.sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
How To Track Lost Mobile Phone :
మొబైల్ పోగొట్టుకుంటే.. ఈ సంచార్ సాథీ వెబ్‍సైట్ (https://sancharsaathi.gov.in/)లో బ్లాక్ చేయవచ్చు. ట్రేస్ చేసేలా చేయవచ్చు. అలాగే.. సెకండ్ హ్యాండ్/పాత మొబైల్ ఫోన్ కొనే ముందు.. ఐఎంఈఐ సాయంతో ఆ ఫోన్.. జెన్యూన్‌దేనా లేదా దొంగిలించిందా అని చెక్ చేయచ్చు. ఆ ఫోన్ బ్రాండ్, మోడల్ నంబర్‌ను నిర్ధారించుకోవచ్చు. కొత్త మొబైల్ కొనే ముందు కూడా ఐఎంఈఐ (IMEI) నంబర్ సాయంతో ఆ మొబైల్ జెన్యూనిటీని చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పాత ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది.
COMMENTS