Clean air with these tips - no need for an air purifier at home!
ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్ అవసరం లేకుండా - ఈ టిప్స్‌తో స్వచ్ఛమైన గాలి!
Best Tips To Air Purifying : ప్రస్తుత రోజుల్లో స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితులు కూడా లేవు. అంతా కాలుష్యమే. పైగా ఈ గాలిని పీల్చడం వల్ల శ్వాస కోశ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ క్రమంలోనే కొందరు నాణ్యమైన గాలిని పొందేందుకు వేలు ఖర్చు పెట్టి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్‌ని ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే, అలాకాకుండా కొన్ని నేచురల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఇంట్లోని గాలిని శుద్ధి చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేపాకులు, పసుపు : ఈ రెండింటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి, ఈ రెండు గాలిని శుభ్రపర్చడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో కొన్ని వేపాకులు(Neem Leaves), కాస్త పసుపు తీసుకొని దాని నిండా వాటర్ నింపి ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని గదిలో ఓ మూలన లేదా టేబుల్‌పై ఉంచితే చాలు. ఆ రూమ్‌లోని ఎయిర్ ఇట్టే శుభ్రపడుతుందంటున్నారు నిపుణులు.
ఎందుకంటే.. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్.. వంటి ఎన్నో గుణాలు ఉంటాయి. అలాగే.. ఈ ఆకుల ఉపరితలం గాలిలోని కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. తద్వారా ఎయిర్ వేగంగా ప్యూరిఫై అవుతుందంటున్నారు.
అలాగే, పసుపుతోనూ మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయని చెబుతున్నారు. అంతేకాదు.. పైన చెప్పిన మిశ్రమంతో చేతుల్ని కూడా శానిటైజ్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
2013లో 'Environmental Health Perspective' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వేపాకులు గాలిలోని PM10 కణాల స్థాయిలను గణనీయంగా తగ్గించగలవని కనుగొన్నారు. PM10 కణాలు ఆరోగ్యానికి హానికరమైన చిన్న ధూళి కణాలు. ఈ పరిశోధనలో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పర్యావరణ విజ్ఞాన విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ టి.ఎస్. సింగ్ పాల్గొన్నారు. వేపాకులలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు గాలిలోని ధూళి కణాలను బంధించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా.. గదిలోని గాలి పరిశుభ్రంగా ఉండాలంటే సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. లేదంటే.. ఆ రూమ్‌లోని తేమ అక్కడి గాలిని కలుషితం చేస్తుందని చెబుతున్నారు.
వంటగదిలో వెలువడే ఘాటైన వాసనల్ని బయటికి పంపించేయడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని అమర్చుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. ఇంట్లోని కలుషితమైన గాలిని కూడా బయటికి పంపించడంలో ఇది సహకరిస్తుందంటున్నారు.
సహజ సిద్ధమైన ఎయిర్ ప్యూరిఫయర్స్‌గా సాల్ట్ ల్యాంప్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ఇవి ఇంట్లోని గాలిలో ఉండే విషపదార్థాలను ఆకర్షించి.. గాలిని శుద్ధి చేస్తాయని చెబుతున్నారు.
వెదురు కర్రలను మండించగా ఏర్పడిన బొగ్గు 'నేచురల్ ఎయిర్ ప్యూరిఫయర్'గా పనిచేస్తుందని చెబుతున్నారు. దీనికి గాలిలోని విషపదార్థాలను, కాలుష్య కారకాలను, బ్యాక్టీరియా, వైరస్‌లను ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.
ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇంట్లోని గాలిని శుద్ధి చేసుకోవడానికి చాలా చక్కగా దోహదం చేస్తాయంటున్నారు. ముఖ్యంగా తులసి, కలబంద, బోస్టన్ ఫెర్న్, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, రబ్బర్ మొక్కలు, పీస్ లిల్లీ, చామంతి.. వంటి మొక్కల కుండీలను ఆయా గదుల్లో అమర్చడం వల్ల అక్కడి గాలి శుద్ధవుతుందని సూచిస్తున్నారు.
గాలిలోని వివిధ సూక్ష్మక్రిములను పారదోలే శక్తి ఎసెన్షియల్ ఆయిల్స్‌కు ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందుకోసం రోజ్‌మేరీ, టీట్రీ, నిమ్మ, లవంగం, గ్రేప్ ఫ్రూట్.. వంటి ఆయిల్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకొని కొన్ని కాటన్ బాల్స్‌పై వేసి.. ఇంటి గదుల్లో అక్కడక్కడా అమర్చుకోవడం వల్ల అక్కడి ఎయిర్ ఫ్యూరిఫై అయి మంచి గాలిని అందిస్తుందంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS