JEE Advanced 2024 Results
JEE Advanced 2024 Results : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 రిజల్ట్స్ విడుదల..
JEE Advanced Results 2024 : లక్షల మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈరోజు ఉదయం 10 గంటలకు తుది ఆన్సర్ కీతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2024 స్కోర్ కార్డులను https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. 7 డిజిట్ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10 డిజిట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఐఐటీ మద్రాస్.. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్ల జాబితా, జోన్ల వారీగా టాపర్ల జాబితా, వారు సాధించిన మార్కులు, వివిధ కేటగిరీలకు కటాఫ్ మార్కులు, పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనుంది.
JEE Advanced 2024 Results Clickhere
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలైన తర్వాత ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే ఇతర సాంకేతిక సంస్థలకు ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) ప్రారంభించనుంది. ఈ ఏడాది జూన్ 10వ తేదీ నుంచి JoSAA Counselling 2024 ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ లో అర్హత సాధించిన అభ్యర్థులు జోసా కౌన్సెలింగ్ (JoSAA Counselling)లో పాల్గొనేందుకు అర్హులు. అయితే.. జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ+ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ.. జేఈఈ మెయిన్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎన్ఐటీ+ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం 31 ఎన్ఐటీలు, ఐఐఈఎస్టీ షిబ్పూర్, 26 ఐఐఐటీలు, 33 ఇతర జీఎఫ్టీఐల సీట్లకు అర్హులు.
COMMENTS