IRCTC: Forgot IRCTC password? Don't Worry.. Easy Reset!
IRCTC: ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా సులభంగా రీసెట్ చేసుకోండి!
Reset IRCTC Username and Password : రైల్వే టికెట్స్ బుకింగ్ ఇప్పుడు చాలా సులభతరమైపోయింది. దానికి ప్రధాన కారణం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). దీని సాయంతో ఆన్‌లైన్లో రైలు టికెట్ బుకింగ్‌లు, హోటల్ రిజర్వేషన్‌లు, ఈ-కేటరింగ్, టూరిస్ట్, చార్టర్ రైళ్లు, ఫ్లైట్ బుకింగ్, హాలిడే ప్యాకేజీలు వంటి అనేక రకాల సేవలను పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ లేదా ఇండియన్ రైల్వేస్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌లను బుక్ చేసుకోవడానికి.. మనం మొదట ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఈ నమోదు విజయవంతమైతేనే వినియోగదారులు గోఐబిబో వంటి వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైలు టికెట్‌లను బుక్ చేసుకునే వీలు కలుగుతుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ సమయంలో, వినియోగదారులు తమ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఐడీ, పాస్ వర్డ్ మర్చిపోతే..? మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఎలా లాగిన్ కావాలో తెలుసుకుందాం..
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైలు టికెట్‌లను బుక్ చేయడానికి, వినియోగదారులు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్‌ను మర్చిపోతే.. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ వినియోగదారులు వారి ఈ-మెయిల్ అడ్రస్ లేదా నమోదిత మొబైల్ నంబర్‌ని ఉపయోగించి వారి లాగిన్ ఆధారాలను సులభంగా రీసెట్ చేయడానికి అనుమతిస్తుంది. ఐఆర్‌సీటీసీ ఈ-టికెటింగ్ వెబ్‌సైట్ ద్వారా ఎలా టికెట్ పొందుకోవాలో తెలుసుకుందాం..
పాస్‌వర్డ్ మార్చడం ఎలాగంటే..
- తొలుత IRCTC వెబ్‌సైట్ https://www.irctc.co.in/ లోకి వెళ్లాలి.
- హోమ్‌పేజీ కుడి ఎగువ భాగంలో ఉన్న ‘లాగిన్’ బటన్‌పై క్లిక్ చేయండి.
- ‘యూజర్ నేమ్’, ‘పాస్‌వర్డ్’ డైలాగ్ బాక్స్‌ల పక్కన, ఆర్‌సీటీసీ పాస్‌వర్డ్ రికవరీ కోసం ‘పార్గాట్ పాస్‌వర్డ్’పై క్లిక్ చేయండి.
- అనంతరం అక్కడ యూజర్ నేమ్ నమోదు చేయాలి.
- అనంతరం Next ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అక్కడ కనిపించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
- ఈ ప్రశ్నలు, జవాబులను అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో నమోదు చేసి ఉంటారు.
- ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన తర్వాత.. IRCTC వెబ్ సైట్ తో రిజిస్టర్ అయిన ఈ-మెయిల్ కు కొన్ని సూచనలు వస్తాయి.
- ఆ లింక్‌పైన క్లిక్ చేసి పాస్‌వర్డ్ ను మళ్లీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతే వెరీ సింపుల్.
COMMENTS