Driving License - RTO : You can apply driving license online.. This is the process!
Driving License - RTO : ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లయ్ చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే!
New Driving Licence Rules from June 1 : కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేయాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్లకు సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ 2024 జూన్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. ఆ కొత్త నిబంధనలు ఏంటో తెలుసుకుందాం..
ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లాల్సిన పనిలేదు :
కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై మీరు డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ (RTO) ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఓ ఆఫీసుకు బదులుగా, ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్దనే డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దానితో మీరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం.. నేరుగా ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. పూర్తిగా ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి!
- మొదట మీరు https://parivahan.gov.in/parivahan/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోని "డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు" ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- వెంటనే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
- దరఖాస్తు ఫారమ్లో అడిగిన వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- నిబంధనల ప్రకారం దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- మీ ప్రాధాన్యతను బట్టి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత.. అవసరమైన పత్రాలతో ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లాలి.
- మీ డ్రైవింగ్ నైపుణ్యాన్ని రుజువు చేసే ఆధారాలను ఆర్టీఓకు చూపించాలి.
- మీ డ్రైవింగ్ స్కిల్స్ పెర్ఫెక్ట్గా ఉన్నట్లయితే.. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.
డ్రైవింగ్ లైసెన్స్ ఫీజుల వివరాలు :
- లెర్నర్ లైసెన్స్ - రూ.200
- లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ - రూ.200
- ఇంటర్నేషనల్ లైసెన్స్ - రూ.1000
- పర్మినెంట్ లైసెన్స్ - రూ.200
- పర్మినెంట్ లైసెన్స్ రెన్యూవల్ - రూ.200
- డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యువల్ - రూ.10,000
- డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ - రూ.5000
COMMENTS