DRDO Recruitment: Central Govt Jobs Without Written Exam..
DRDO Recruitment: రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 జీతం.. పూర్తి వివరాలివే.
కేంద్రప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు, జీతం, పరీక్షా విధానం వంటి మొదలైన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి భారీ శుభవార్త. ఇటీవలే DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
మొత్త పోస్టుల సంఖ్య:
DRDO తాజాగా విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనుంది.
చివరి తేదీ:
మీరు ఈ ఉద్యోగాలుకు ధరఖాస్తు చేసుకునేందుకు జూన్ 19 చివరి తేదీ..
విద్యార్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి డివిజన్‌తో పాటు కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో M.E/M.Tech కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. SC/STలకు 05 సంవత్సరాలు, OBCలకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:
DRDOలో ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 37,000, HRA అధనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
తేదీ: 19-06-2024 & 20-06-2024
రిపోర్టింగ్ సమయం: 08:30 AM నుంచి 10:00 AM వరకు
స్థలం: DGRE, చండీగఢ్.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS