Do these symptoms appear early in the morning? But you have diabetes!
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు డయాబెటిస్ ఉన్నట్లే!
Signs Of Sugar In Morning : రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ వచ్చే హెచ్చుతగ్గులతో పాటు దైనందిక జీవితంలో కనిపించే లక్షణాలను బట్టి మనకు డయాబెటిస్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఉదయం సమయంలోనే మనం ఎక్కువగా ఈ లక్షణాలను గమనించగలం. వీటిని శరీరం మనకు ఇస్తున్న హెచ్చరికలుగా భావించి పరీక్ష చేయించుకుంటే ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏవంటే?హైపర్‌గ్లేకేమియా (ఎక్కువగా దాహం):
ఇది ఉదయం వేళల్లో రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే కనిపిస్తుంది. ఉదయం 4 నుంచి 8గంటల సమయం మధ్యలో ఈ మార్పులు కనిపిస్తాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు దాహంగా అనిపిస్తుంది. హై బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోకపోవడం వల్ల కూడా గ్లూకోజ్ పెరిగి శరీరంలో ద్రావణాలు ఎక్కువగా అవసరమై డీహైడ్రేట్ అయి దాహం ఎక్కువగా అనిపిస్తుంది.
మూత్రం ఎక్కువగా అవుతుండటం:
ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం షుగర్ లెవల్ పెరిగిందనడానికి ఒక సూచన. సాధారణంగా ఇది రాత్రి లేదా ఉదయం వేళల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలు మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి.
ఉదయం నీరసంగా:
నిద్ర లేవగానే నీరసంగా, మత్తుగా ఉండటం కూడా షుగర్ ఎక్కువగా ఉందనడానికి ఒక ఉదాహరణ. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి శరీరానికి సరిపడ శక్తి ఇవ్వలేకపోవడం వల్ల ఉదయాన్నే నీరసించిపోతాం. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లి నిద్ర సరిగా లేకపోవడం కూడా ఉదయం సమయంలో నీరసానికి కారణంగా భావించవచ్చు.
తలనొప్పి:
డయాబెటిస్ ఉన్నవాళ్లలో తరచుగా కనిపించే లక్షణం తలనొప్పి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే హైపర్ గ్లైసేమియా, తక్కువగా ఉంటే హైపోగ్లైసేమియా అంటుంటారు. ఇలా ఉన్నప్పుడు తరచూ తలనొప్పి వస్తుంటుంది.
నోరు పొడిబారడం:
నిద్ర లేచిన వెంటనే నోరు పొడబారినట్లు అనిపిస్తోంది. షుగర్ లెవల్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జరగొచ్చు. శరీరంలో ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుండటం వల్ల డీహైడ్రేట్ కు గురవుతుంటారు. అలా జరగడం వల్ల నోరు పొడిబారినట్లు అవుతుంది.
ఆకలి ఎక్కువ:
ఇన్సులిన్ తగ్గిపోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి సరైన మోతాదులో లభించదు. ఫలితంగా ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. కొద్దిసేపటికే ఆకలి వేసి ఆహారం అందించమని బ్రెయిన్ నుంచి శరీరానికి సిగ్నల్స్ అందుతుంటాయి. ఈ లక్షణాల్లో ఉదయాన్నే ఏది గమనించినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. సమస్య ఆరంభంలో ఉన్నప్పుడే గమనించి చికిత్స తీసుకోగలిగితే పరిణామాలు అంత తీవ్రంగా మారకముందే జాగ్రత్త పడొచ్చు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS