Business idea: Don't underestimate.. A business that pours lakhs.
Business idea: తక్కువ అంచనా వేయకండి.. లక్షలు కురిపించే వ్యాపారం.
ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయంతో పోల్చితే వ్యాపారంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వ్యాపారం అనగానే పెట్టుబడి పెట్టాలి, లాభాలు వస్తాయో లేదో అనే ఆలోచన ఉంటుంది. అయితే కాలంతో సంబంధం లేకుండా, నష్టమనేది లేకుండా ఉండే వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్ ఉండేది గొర్రెల వ్యాపారం. గొర్రెల వ్యాపారం ఏంటి అని చీప్‌గా చూడకండి. భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి గోట్ ఫామ్ వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వారు సైతం ఉద్యోగాలు మానేసి, గొర్రెల పెంపకాన్ని వ్యాపారంగా మార్చుకొని లక్షల్లో ఆర్జిస్తున్నారు. గొర్రెల వ్యాపారాన్ని ఉన్న ఊర్లోనే ఉంటూ ప్రారంభించవచ్చు.
గోట్ ఫామ్‌ను ప్రారంభించేందుకు ముందుగా మీకు కొంత ఖాళీ స్థలం ఉండాలి. ఒక షెడ్ కూడా ఉండాలి. గొర్రెల పెంపకానికి వాటికి అవసరమయ్యే దాణా కూడా అవసరపడుతుంది. సాధారణంగా గ్రామాల్లో గొర్రెలకు సహజంగా లభించే చెట్ల ఆకులను అందిస్తుంటారు. అయితే మీకు అలా వీలు కాకపోతే ప్రత్యేకంగా వాటికి దాణా కూడా అందించవచ్చు. గొర్రెల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సైతం రుణాలు అందిస్తుంటాయి. అలాగే పశు పోషణపై కూడా సబ్సిడీ అందిస్తున్నారు.
ఇక గొర్రెల పెంపకాన్ని ప్రారంభించాలనుకునే వారు ముందుగా నీరు, గొర్రెలకు అవసరమైన మేత, వైద్య సాయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వీటితో పాటు స్థానికంగా ఉన్న వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా గొర్రెలను కొనుగోలు చేసుకొని వెళ్లే వారు ఉంటారు. అలాంటి వారి కాంటాక్ట్స్ తీసుకోవాలి. ప్రారంభంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినా, కాలక్రమేణ భారీగా లాభాలను ఆర్జించవచ్చు.
COMMENTS