DMEAP Govt Jobs 2024
DMEAP Govt Jobs 2024 : ఆంధ్రప్రదేశ్‌లో 158 కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేల జీతం.
ప్రధానాంశాలు:
- డీఎంఈఏపీ రిక్రూట్‌మెంట్ 2024.
- 158 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల.
- మే 15వ తేదీ దరఖాస్తులకు చివరితేది.
AP Medical Services Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే.. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. కొత్తగా ప్రారంభించిన 5 కాలేజీల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు మే 15వ తేదీ చివరితేది. అభ్యర్థులకు పూర్తి వివరాలకు https://dme.ap.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. అభ్యర్థులు అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు : 158 ట్యూటర్ పోస్టులు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
వేతనం: నెలకు రూ. 70,000గా ఉంటుంది.
ఎంపిక విధానం: వంద మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా 75 శాతం మార్కుల వరకు కేటాయిస్తారు. కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి వెయిటేజీ ఉంటుంది.
వయసు: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 47 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభ తేదీ : మే 4, 2024.
దరఖాస్తులకు తుది గడువు : మే 15, 2024.
Important Links:
FOR TOTAL VACANCIES CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
COMMENTS