TS Inter Results 2024
ఈ నెల 24న టీఎస్ ఇంటర్ ఫలితాలు, బోర్డు అధికారిక ప్రకటన.
TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల(TS Inter Results 2024)పై అధికారి ప్రకటన వచ్చింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను(TS Inter Results 2024 Date) ఒకేసారి విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లో విద్యాశాఖ సెక్రటరీ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. హెచ్.టి.తెలుగులో ఇంటర్ ఫలితాలు సులభంగా చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ లింక్ https://tsbie.cgg.gov.in/ లో ఇంటర్ ఫలితాలు పొందవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 10 వతేదీన మూల్యాంకనం(Spot Valuation) పూర్తి చేశారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేశారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do లో విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Results 2024) ఫలితాలను హెచ్.టి. తెలుగులో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే https://tsbie.cgg.gov.in/ లింక్ పై విద్యార్థులు ఫలితాలను సింగిల్ క్లిక్ లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ కింది మీ ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే మీ మార్కుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.
TS Intermediate Results 2023 Available Websites Links:
TS Intermediate RESULTS LINK 1
TS Intermediate RESULTS LINK 2
COMMENTS