TS Inter Results 2024: Alert for Telangana Inter students.. This is the result release date!
TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల డేట్ ఇదే!
TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీని విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకన పక్రియ పూర్తియ్యింది. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలిస్తున్నారు. మొత్తం నాలుగు విడతల్లో మూల్యాంకనం చేసినట్లు అధికారులు తెలిపారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పరీక్ష రాసినవారు, గైర్హజరైనవారు, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఏప్రిల్ 21వ తేదీ నాటికి ముగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అన్నీ సానుకూలంగా జరిగితే..ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన లేదా ఆ తర్వాత ఏక్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజవ్వగా ఇందులో.. 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను అధికారులు షురూ చేశారు. మొత్తం నాలుగు విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్ 10 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు మూల్యాంకన సమయంలో హెచ్చరించింది. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
అటు ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏప్రిల్ 12న ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.
COMMENTS