Ponnaganti Kura: Nutrient rich Ponnaganti curry.. Can check overweight!
Ponnaganti Kura: పోషకాల పుట్ట పొన్నగంటి కూర.. అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు!
ఆకు కూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. దీన్నే చెన్నగంటి కూర అని కూడా అంటారు. ఈ ఆకు కూర భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఒక్కటి ఏంటి.. చాలా రకాల పోషకాలు ఉంటాయి. పొన్నగంటి కూర తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. చాలా మంది ఎక్కువగా పాల కూర, తోట కూర, గోంగూర తింటూ ఉంటారు. పొన్న గంటి కూరను కూడా వారంలో ఒక్కసారి మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే.. ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఈ కూర ఏడాది పొడవునా కూడా లభిస్తుంది. మరి పొన్నగంటి కూర తింటే ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వెయిట్ లాస్:
పొన్నగంటి కూర తింటే త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
రోగ నిరోధక శక్తి మెండు:
పొన్నగంటి కూర తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది మెండుగా లభిస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ లభిస్తాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో త్వరగా రోగాల బారిన పడకుంటా ఉంటారు. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
రక్త హీనత తగ్గుతుంది:
పొన్నగంటి కూరలో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా లభిస్తుంది. కాబట్టి ఈ కూర తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్తం లేని వారు ఈ ఆకు కూరతో తయారు చేసే ఆహారాలు తింటే మంచి రిజల్ట్ ఉంటుంది.
డయాబెటీస్‌ను కంట్రోల్ చేస్తుంది:
షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నీ తినలేరు. కానీ పొన్నగంటి కూరను తినవచ్చు. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తింటే షుగర్ లెవల్స్ బాగా కంట్రోల్ అవుతాయి.
చర్మానికి మేలు:
పొన్నగంటి కూరలో విటమిన్లు అనేవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇది తింటే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పొన్నగంటి కూర సహాయ పడుతుంది.
క్యాన్సర్ వ్యాధిని నియంత్రిస్తుంది:
పొన్నగంటి కూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఈ ఆకు కూర తింటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు APTEACHERS9.COM బాధ్యత వహించదు.)
COMMENTS