Millet Curd Rice: Millet Curd Rice keeps the stomach cool in summer
Millet Curd Rice: వేసవిలో కడుపును చల్లగా ఉంచే మిల్లెట్ పెరుగన్నం.
Millet Curd Rice: వేసవి కాలంలో కేవలం చల్లటి పదార్థాలు తాగడమే కాకుండా కడుపు చల్లగా ఉండేందుకు ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో పెరుగు, మజ్జిగ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే మిల్లెట్ పెరుగు అన్నం కూడా కడుపును చల్లగా ఉంచుతుంది. మిల్లెట్ పెరుగు అన్నం ఆరోగ్యకరమే కాకుండా రుచికూడా బాగుంటుంది. ఈ రెసిపీ చేయడం కూడా చాలా సులభం.
మిల్లెట్ పెరుగు అన్నం కోసం కావలసినవి:
1 కప్పు ఫాక్స్‌టైల్ మిల్లెట్, 2 ½ కప్పులు నీరు, ½ కప్పు పాలు, 3 కప్పులు పెరుగు, 1 కప్పు తురిమిన దోసకాయ, 1 కప్పు తురిమిన క్యారెట్, 3 ఉప్పుల ఉల్లిపాయ ముక్కలు, తరిగిన 3 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు అవసరం అవుతాయి.
తాలింపు కోసం:
21/2 tsp నూనె, 1 tsp ఆవాలు, 2 కందిపప్పు పప్పు, 2 tsp శెనగ పప్పు, 2 ఎండు మిర్చి, 1/2 tsp ఇంగువ, 2 tbsp వేరుశెనగ, 2 పచ్చిమిర్చి, 6-7 కరివేపాకు రెమ్మలు అవసరం.
మిల్లెట్ పెరుగు అన్నం ఎలా తయారు చేయాలి..?
కడిగిన మిల్లెట్‌ను 1/2 కప్పుల నీటితో ఒక పాత్రలో వేసి 15-20 నిమిషాలు ఉడికించాలి. మిల్లెట్‌ను మీడియం మంటపై ఉడికించి తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. మిల్లెట్ చల్లారిన తర్వాత మెత్తగా చేసుకోవాలి. పెరుగు, ఇతర కూరగాయలతో పాటు తురిమిన దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యాప్సికమ్ వేసి బాగా కలపాలి. తర్వాత పెరుగు మిశ్రమంలో ఉప్పు వేసి బాగా కలపాలి. బాగా రావాలంటే మజ్జిగ లేదా పాలను వేసుకోవచ్చు. తాలింపు కోసం ఒక పాన్‌లో కొంచెం నూనె తీసుకుని అందులో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడనిచ్చి పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత ముందుగా పక్కన ఉంచిన మిల్లెట్ పెరుగు అన్నంలో కలపాలి.
COMMENTS