Are you planning a Kerala tour for relief from summer.. IRCTC tour package at low price.. Details for you
వేసవి నుంచి ఉపశనం కోసం కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. డీటైల్స్ మీ కోసం
వేసవి ఉక్కబోత నుంచి ఉపశమనంతో పాటు కనులకు విందుచేసే ప్రకృతి అందాలను వీక్షించడానికి కేరళ బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. కొబ్బరిచెట్లు, నదులు, పచ్చని అందాలతో ఉండే కేరళ అందాలను గురించి ఎంత వర్ణించినా తక్కువే.. చూసే కొద్దీ చూడాలనిపించే వాతావరణం కేరళ సొంతం. అయితే వేసవి సెలవులను ఎక్కడైకైనా వెళ్లి ఎంజాయ్ చేయాలనీ ప్లాన్ చేస్తుంటే కేరళను ఎంపిక చేసుకోండి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే కేరళ అందాలను చూడడమే కాదు.. మండుతున్న వేసవి నుంచి ఉపశమనం పొందవచ్చు. కల్చరల్ కేరళ టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందిస్తోంది. ఏడు రోజుల పాటు సాగనున్న ఈ టూర్ లో కేరళలోని ప్రసిద్ధి ప్రాంతాలైన అలెప్పీ, మున్నార్, కొచ్చి, త్రివేండం వంటి ప్రాంతాల్లోని అందాలను, ప్రసిద్ధి ఆలయాలను సందర్శించవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఈ రోజు కల్చరల్ కేరళ టూర్ షెడ్యూల్ వివరాలను గురించి తెలుసుకుందాం..
కల్చరల్ కేరళ టూర్ షెడ్యూల్ డీటైల్స్:
కల్చరల్ కేరళ పేరుతో IRCTC టూరిజం శాఖ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి అందిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ టూర్ మొదలవుతుంది. ఆరో రాత్రులు, ఏడూ పగళ్లు ఉందనున్న ఈ టూర్ ప్యాకేజీ ఈ నెల 28వ తేదీ నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
- మొదటి రోజు ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ టూర్ మొదలు కానుంది. నేరుగా కొచ్చికి చేరుకుంటారు. అక్కడ హోటల్ కి వెళ్లి చెకిన్ అయిన తర్వాత కొచ్చిలోని డచ్ ప్యాలెస్ తో పాటు ప్రసిద్ధి ప్రాంతాలను చూడవచ్చు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. రాత్రి కొచ్చిలోనే బస చేస్తారు.
- రెండో రోజు ఉదయం కొచ్చిలో బ్రేక్ ఫాస్ట్ చేసి మున్నార్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ చీయప్పర జలపాతాలు, టీ మ్యూజియం వంటి వాటిని చూడవచ్చు.. రాత్రి మున్నార్ లోనే హోటల్ లో బస చేస్తారు.
- మూడో రోజు ముందుగా టిఫిన్ తిని మున్నార్ లోని ప్రకృతి అందాలను, ప్రసిద్ధి చెందిన ఏకో పాయింట్ , కుండ్ల డ్యామ్ లేక్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. మూడో రోజు రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
- నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తెక్కడికి పయనం అయి అక్కడకు చేరుకుంటారు. తెక్కడిలోని స్పెస్ ప్లానెంటేషన్ తో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి తెక్కడి లోనే బస చేస్తారు.
- ఐదో రోజు ఉదయం తెక్కడిలో అల్పాహారం తిని అక్కడ నుంచి అలెప్పీకి వెళ్తారు. అక్కడ బ్యాక్ వాటర్స్ రైడ్ ను ఎంజాయ్ చేయడమే కాదు అలెప్పీ అందాలను వీక్షించవచ్చు. రాత్రి అలెప్పీలోనే బస చేయాల్సి ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం టిఫిన్ తిని చదయమంగళంకు వెళ్లాల్సి ఉంటుంది. జటాయు ఎర్త్ సెంటర్ నేచర్ పార్క్ ను సందర్శించి అక్కడ నుంచి త్రివేండానికి చేరుకుంటారు. రాత్రి త్రివేండ్రంలో బస చేయాల్సి ఉంటుంది.
- ఏడో రోజు ఉదయం అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. అనంతరం నేపియర్ మ్యూజియంను సందర్శించాల్సి ఉంటుంది. ఏడో రోజు సాయంత్రం కేరళ టూర్ ముగించుకుని విమానంలో హైదరాబాద్ కు తిరిగి బయలుదేరతారు. ఏడో రోజు సాయంత్రం శంషాబాద్ కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
కేరళ టూర్ ప్యాకేజీ డీటైల్స్:
- కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీ రూ. 53100లు చెల్లించాల్సి ఉంది.
- డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 35700
- ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 33750
- 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఏఏ సదుపాయాలు ఇస్తారంటే:
ఈ టూర్ ప్యాకేజీలో టికెట్ ధరలోనే హోటల్‌లో వసతి సౌకర్యం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తో పాటు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను ఇస్తారు. ఈ టూర్ ప్యాకేజీ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
COMMENTS