He peeled the skin and sewed sandals and gave it to his mother as a gift
చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి తల్లికి కానుకగా ఇచ్చాడు.
"తన చర్మంతో చెప్పులు తయారు చేయించి ఇచ్చినా తల్లికి సరిపోదని రాముడు స్వయంగా చెప్పాడు. కాబట్టి, ఈ ఆలోచన నా మదిలో వచ్చింది. నా చర్మంతో పాదరక్షలు తయారు చేసి వాటిని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని రౌనక్ చెప్పారు. ఇతను ఒకప్పుడు రౌడీ షీటర్.
రామాయణం నుంచి స్ఫూర్తి పొందిన ఓ వ్యక్తి తల్లికి తన చర్మంతో చెప్పులు కుట్టించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. రౌణక్ గుర్జార్ అనే ఈ వ్యక్తి ఒకప్పుడు రౌడీషీటర్. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడు. గతంలో రౌణక్‌పై పోలీసులు కాల్పులు కూడా జరిపారు కూడా. కానీ గాయాలతో బయటపడ్డాడు. ఇప్పుడు తప్పుడు మార్గాన్ని వదిలి సవ్యంగా నడుచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తల్లిపై తన ప్రేమని చాటు కునేందుకు తొడ చర్మాన్ని కొంత తొలగించి వాటితో చెప్పులు కుట్టిచ్చాడు. శ్రీ రాముడు తన తల్లిపై చూపించిన ప్రేమే తనకు ఆదర్శం అని చెబుతున్నాడు రౌణక్. అతడు రోజూ రామాయణం చదువుతాడట.
“రాముడే నాకు ఆదర్శం. అమ్మ కోసం ఏం చేసినా తక్కువే. స్వయంగా రాముడే ఈ విషయం చాటిచెప్పాడు. చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అని అన్నాడు. ఆ మాటను నేను అమలు చేశాను. నా చర్మంతో చెప్పులు కుట్టించి.. అమ్మకు కానుకగా ఇచ్చాను” అని రౌణక్ గుర్జర్ పేర్కొన్నాడు.
ఆస్పత్రికి వెళ్లి ప్రత్యేకంగా సర్జరీ చేయించుకుని తొడ నుంచి కొంత చర్మాన్ని తీయించాడు రౌణక్. ఈ విషయాన్ని కుటుంబంలో ఎవరికీ చెప్పలేదు. ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చి.. చెప్పులు చేయించాడు. ఆ తర్వాత ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్న సమయంలో తల్లికి ఈ చెప్పులను ప్రేమగా అందజేశాడు. ఇది చూసి అక్కడి వాళ్లంతా నిర్థాంతపోయారు. ఎమోషనల్ అయ్యారు. అతని తల్లైతే కన్నీళ్లను ఆపులేకపోయింది.
COMMENTS