Tata Motors: Eye-catching deal on Tata electric car.. Rs. 3.15 lakh discount at the same time..!
Tata Motors: టాటా ఎలక్ట్రిక్ కారుపై కళ్లు చెదిరే డీల్.. ఏకంగా రూ.3.15 లక్షల డిస్కౌంట్..!
Tata Motors: మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని భావిస్తుంటే మీకు కళ్లు చెదిరే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ చెందిన ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ.3.15 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. ఈ కారుపై గరిష్ఠ డిస్కౌంట్ లభిస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tata Motors: మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మార్కెట్ డిమాండ్‌ను ఆకర్షించేందుకు చాలా కంపెనీలు కొత్త కొత్త విద్యుత్తు కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కొన్ని కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 15 లక్షలు ఆపైన అవుతోంది. అయితే, ఈవీ కారు కొనుగోలుదారులకు కళ్లు చెదిరే డీల్ ప్రకటించింది టాటా మోటార్స్. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎస్‌యూవీకి సంబంధించి ఫేస్లిఫ్ట్, ప్రీ ఫేస్లిప్ట్ వెర్షన్లకు తగ్గింపులను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ ఎంవై 2023 తో పాటు పరిమిత సంఖ్యలో యూనిట్లకు మాత్రమే వర్తించనుంది.
టాటా నెక్సాన్ ఈవీకి సంబంధించిన ప్రీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారుపై గరిష్ఠంగా రూ. 3.15 లక్షల భారీ తగ్గింపు అందిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, మ్యాక్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో అత్యంధికంగా క్యాష్ డిస్కౌంట్ రూ. 2.65 లక్షలు అందుతోంది. అలాగే ఎక్స్చేంజీ బోనస్ కింద రూ. 50 వేలు పొందవచ్చు. దీంతో మొత్తంగా రూ. 3.15 లక్షలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే నెక్సాన్ ఈవీ ప్రైమ్ విషయానికి వస్తే క్యాష్ డిస్కౌంట్ రూ. 2.30 లక్షలు, ఎక్స్చేంజీ బోనస్ రూ.50 వేలుగా ఉంది. అంటే మొత్తంగా రూ. 2.80 లక్షలు డిస్కౌంట్ పొందవచ్చు.
నెక్సాన్ ఈవీ ప్రైమ్ కారు 30.2 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ తో 129 హెచ్‌పీ మోటర్ కలిగి ఉంది. దీని రేజ్ 312 కిలోమీటర్లుగా ఉంది. అలాగే నెక్సాన్ మ్యాక్స్ కారు 40.5 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ తో లభిస్తోంది. 143 హెచ్‌పీ సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ కలిగి ఉంది. మరోవైపు.. టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డిస్కౌంట్ పై ఎలాంటి డిస్కౌంట్ అందుబాటులో లేదని తెలుస్తోంది. అయితే 2023 లో తయారైన యూనిట్లకు గ్రీన్ బోనస్ రూ. 50 వేలు లభిస్తోంది. మరోవైపు.. 2024 లో తయారైన ఈవీ కార్లకు గ్రీన్ బోనస్ రూ. 20 వేలుగా ఉంది. వీటితో పాటు టాటా టియాగో ఈవీ కారు 2023 మోడల్ అయితే గ్రీన్ బోనస్ రూ.50 వేలు, ఎక్స్చేంజీ బోనస్ రూ. 15 వేలు అందుతోంది. 2024 మోడల్ అయితే ఎక్స్చేంజీ బోనస్ రూ. 25 వేలు లభిస్తోంది. ఈ ఆఫర్ మార్చి నెలాఖరు వరకు ఉంటాయని తెలుస్తోంది. అయితే, ప్రాంతం, డీలర్ షిప్ ఆధారంగా ఆఫర్లు మారుతాయని గుర్తుంచుకోవాలి.
COMMENTS