Sugar Levels: Eating these leaves does not increase the sugar levels at all
Sugar Levels: ఈ ఆకులు తింటే షుగర్ లెవల్స్ అస్సలు పెరగవు.
Sugar Levels: డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి కారణం ఇన్సులిన్ స్థాయిలు పెరగడమే. కొన్నిసార్లు శరీరం ఇన్సులిన్‌ను జీర్ణించుకోలేకపోతుంది. అప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం ప్రారంభమవుతుంది. కొన్ని ఔషధ మొక్కల ఆకులు సహజంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
మధుమేహం కంట్రోల్:
కాక్టస్ ఇగ్నియస్ అనే శాస్త్రీయ నామం ఉన్న ఇన్సులిన్ ప్లాంట్ మధుమేహాన్ని నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. కానీ అపారమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలోని సహజ రసాయనాలు చక్కెరను గ్లైకోజెన్‌గా మారుస్తాయి. ఇది జీవక్రియ ప్రక్రియను పెంచుతుంది. ఈ మొక్క యొక్క ఆకులు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఆకులో ప్రొటీన్లు, టెర్పెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, బి-కెరోటిన్, కార్సోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎలా వినియోగించాలి..?
ఈ పచ్చి ఆకు రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయి. ఇన్సులిన్ మొక్క ఆకులను ఉదయాన్నే కడిగి నమలాలి. ఈ మొక్కతో సంవత్సరం పొడవునా ప్రయోజనం పొందాలనుకుంటే ఈ ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేసి ప్రతి రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. WWW.APTEACHERS9.COM దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
COMMENTS