Success Story: Training in Indore, fighting with enemies on the borders..First woman sniper in BSF..This is the success story of Suman Kumari.!
Success Story: ఇండోర్‌లో ట్రైనింగ్, సరిహద్దుల్లో శత్రువులతో పోరాటం..బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళ స్నైపర్..సుమన్ కుమారి సక్సెస్ స్టోరీ ఇదే.!
బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళాస్నైపర్ గా సుమన్ కుమారి హిస్టరీ క్రియేట్ చేశారు. సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్‌లో 8 వారాల కోర్సుకు హాజరయ్యారు. ఆ సమయంలో 56 మంది పురుషులలో ఆమె ఒక్కరే. బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నిపర్‌గా ఘనత సాధించింది. ఆమె సక్సెస్ స్టోరీ చూద్దాం .
Success Story: భారత సైన్యంతోపాటు.. ప్రత్యేక దళాలలో స్నిపర్ల పాత్ర ఎంతో ముఖ్యమైంది.మనం సినిమాల్లో స్నిపర్లను చూస్తుంటాం. ముఖ్యంగా లేడిఓరియెంటెడ్ సినిమాల్లో సరిహద్దుల్లో యుద్ధం, సర్జికల్ స్ట్రైక్, బందీలుగా ఉన్నవారిని విడిపించడం, జంగిల్ వార్ ఫేర్ వంటి ప్రతిచోటా స్నిపర్లు కిలోమీటర్ల దూరం నుంచే శత్రువులపై గురిపెట్టి తూటాలు పేల్చుతుంటారు.ఇలాంటి సన్నివేశాలను చూస్తుంటే…నిజ జీవితంలో కూడా ఇలాంటి పాత్రలు ఉంటాయా అనే ఆలోచన మనలో కలుగుతుంది. కానీ ఈ స్టోరీ చదివితే…మీరు బీఎస్ఎఫ్ లో నారీశక్తిని చూసి గర్వపడతారు. ఆమెనే బీఎస్ఎఫ్ లో మొదటి మహిళా స్నిపర్ సుమన్ కుమారి సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం.
బీఎస్ఎఫ్ మొదటి మహిళా స్నిపర్:
ఇండోర్‌లోని సెంట్రల్ ఆర్మమెంట్ అండ్ కంబాట్ స్కిల్స్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) బ్యాచ్ వార్తల్లో నిలిచింది. ఎందుకంటే అటువంటి కఠినమైన శిక్షణ తర్వాత బీఎస్ఎఫ్ మొదటి మహిళా స్నిపర్‌ని సిద్ధం చేశారు. ఇండోర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంపస్‌లో నిర్వహించిన ఎనిమిది వారాల స్నిపర్ శిక్షణా కోర్సులో ఎస్‌ఐ సుమన్ కుమారి ఒక్కరే.ట్రైనింగ్ సమయంలో 56 మంది పురుషులు. ఆ బ్యాచులో సుమన్ కుమారి ఒక్కతే అమ్మాయి. అయినా ఏమాత్రం వెనకడుగు వేయని..సుమన్ కుమారి..ధైర్యంగా ముందుకు సాగింది. శిక్షణను పూర్తి చేసుకుంది. బీఎస్ఎఫ్ పంజాబ్ యూనిట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నియామకం అయ్యింది. స్నిపర్ కోర్సు పూర్తయిన తర్వాత, బీఎస్ఎఫ్ ట్విట్టర్ పోస్ట్ చేయడం ద్వారా మొదటి మహిళా స్నిపర్ గురించి సమాచారాన్ని పంచుకుంది.
పంజాబ్ లో ఓ ప్లాటూన్ కు కమాండర్:
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సుమన్..పంజాబ్ లో ఓ ప్లాటూన్ కు కమాండర్ గా ఉన్నారు. సరిహద్దు వెంట స్నైపర్ దాడుల ముప్పును గమనించిన తర్వాత స్నైపర్ కోర్సు చేయాలని తాను స్వచ్చందంగా ముందుకు వచ్చారు. ముల్లును ముల్లుతోనే తీయాలని డిసైడ్ అయిన సుమన్..కోర్సులో జాయిన్ అయ్యేందుకు తన ఉన్నతాధికారుల నుంచి ఆమోదం పొందారు. ఈ కోర్సులో 56 మంది పురుషుల్లో సమన్ ఒక్కతే అమ్మాయి కావడం విశేషం. కమాండ్ ట్రైనింగ్ తర్వాత ఈ కోర్సును అత్యంత కఠినమైన ట్రైనింగ్ గా పరిగణిస్తారు.
స్నైపర్ కోర్సులో ఆల్ఫా, బ్రావో గ్రేడింగ్:
‘అసాధారణంగా’ రాణించి వారికి.. స్నైపర్ కోర్సులో ఆల్ఫా, బ్రావో గ్రేడింగ్ లభిస్తుంది. అయితే సుమన్ సాధించిన ‘ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్’కు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షను తీసుకుంటారని సీఎస్‌డబ్ల్యూటీ ఐజీ భాస్కర్ సింగ్ రావత్ వివరించారు. ఈ గ్రేడ్ ఆమెకు స్నైపర్ ఇన్స్ట్రక్టర్గా పోస్టింగ్ పొందడానికి అర్హత కల్పిస్తుందని తెలిపారు. అసాధారణంగా రాణించిన ట్రైనీలకు ఆల్ఫా, బ్రావో గ్రేడింగ్ లభిస్తుందని…సుమన్ సాధించిన ‘ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ ‘కు ప్రత్యేక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిపారు. బీఎస్ఎఫ్ లో తొలి మహిళా స్నైపర్ అయిన ఆమె ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. కమాండో ట్రైనింగ్ తర్వాత ఈ కోర్సు అత్యంత కఠినమైనదని రావత్ తెలిపారు.పురుష ట్రైనీలు కూడా ఇందులో పనిచేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఈ కోర్సులో సుమన్ ఎలా రాణించారో వివరించారు. ఈ స్నైపర్ కోర్సుకు చాలా శారీరక, మానసిక బలం అవసరమని తెలిపారు. స్నైపర్‌ను గుర్తించకుండానే శత్రువుకు దగ్గరయ్యేలా ఏకాగ్రతపై దృష్టి సారించి ఈ ఏడాదిట్రైనింగ్ విధానాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు.
సుమన్ నేపథ్యం:
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని ఓ సామాన్య కుటుంబానికి చెందిన సుమన్.. బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. ఆమె 2021లో బీఎస్ఎఫ్ లో చేరారు.
COMMENTS