Sleeping Disadvantages: Sleeping with your face covered with a bed sheet? Do you know how dangerous it is?
Sleeping Disadvantages: మీ ముఖాన్ని బెడ్‌షీట్‌తో కప్పుకుని నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్న తప్పుడు అలవాటు ప్రాణాలమీదకు తెస్తుంది. కొంతమందికి పడుకునేటప్పుడు బెడ్‌షీట్‌తో ముఖాన్ని కప్పుకునే అలవాటు ఉంటుంది.అలా కప్పుకోవడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ముఖాన్ని బెడ్‌షీట్ లేదా దుప్పటితో కప్పుకుంటే ఎంత ప్రమాదమో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Sleeping Disadvantages: నేటికాలంలో చాలా మంది అనారోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం,తగినంత శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కాబట్టి ఒక తప్పు అలవాటు కూడా మీకు ప్రాణాంతకం కావచ్చు. కొంతమందికి పడుకునేటప్పుడు బెడ్‌షీట్‌తో ముఖాన్ని కప్పుకునే అలవాటు ఉంటుంది. అయితే, అలా చేయడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. నిజానికి, మీ ముఖాన్ని బెడ్‌షీట్, దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల ఊపిరాడదు. ఇది శరీరంలో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల నిద్రలో ఊపిరాడకుండా ఉంటుంది.ఇదే కాదు జీవక్రియ కూడా క్షీణిస్తుంది. కాబట్టి ముఖాన్ని దుప్పటితో మొత్తం కప్పుకుని నిద్రపోకూడదని వైద్య నిపుణులు అంటున్నారు.
బెడ్‌షీట్‌ను ముఖానికి కప్పుకుని పడుకుంటే ఊపిరాడక పోవచ్చు. కానీ దీని కారణంగా, నోరు కూడా మూసుసుకుపోతుంది. ఇది ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. అలాగే ముఖాన్ని కప్పుకుని నిద్రించే వారు చర్మ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారు. నిజానికి బెడ్‌షీట్‌తో ముఖాన్ని కప్పుకోవడం వల్ల శరీరానికి, చర్మానికి రాత్రంతా స్వచ్ఛమైన గాలి అందదు. దీని వల్ల స్కిన్ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, చర్మం నల్లగా, పొడిగా మారుతుంది. ముఖాన్ని కప్పుకుని నిద్రించే వారు వేగంగా బరువు పెరుగుతారు. నిజానికి బెడ్‌షీట్‌తో ముఖాన్ని కప్పుకుని నిద్రించడం వల్ల శరీరం త్వరగా వేడెక్కుతుంది. ఇది మరింత నిద్రకు దారితీస్తుంది.దీంతో ఈజీగా బరువు పెరగడం ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ముఖాన్ని కప్పుకుని నిద్రపోవడం మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆక్సిజన్ తగినంత పరిమాణంలో రక్తాన్ని చేరుకోకపోతే, అది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.దీంతో మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది.
COMMENTS