Scientists extracted gold from waste.. For one rupee investment Rs. 50 profit!
వ్యర్థాల నుంచి బంగారం తీసిన శాస్త్రవేత్తలు.. ఒక్క రూపాయి పెట్టుబడికి రూ. 50 లాభం!
శాస్త్రవేత్తలు ఓ లాభసాటి మార్గాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని లాభసాటిగా వేరు చేయగలిగారు.
Electronic Waste: ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగ్గానే.. వాటి వ్యర్థాలపైనా ఆందోళనలు వచ్చాయి. వాటిని ఎలా డిజాల్వ్ చేయాలా? అనే చర్చ జరిగింది. దీనితోపాటు మాదర్ బోర్డు వంటివాటిల్లో ఉపయోగించే అనేక లోహాల్లో బంగారం కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరం కాలం చెల్లిన తర్వాత ఆ బంగారాన్ని వ్యర్థాల్లో అలాగే వదిలిపెట్టే పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. ఎందుకంటే.. అందులో నుంచి బంగారం తీసే ప్రక్రియకు వచ్చిన బంగారం విలువ కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నది. కానీ, తాజాగా శాస్త్రవేత్తలు లాభసాటి మార్గాన్ని కనుగొన్నారు.
ప్రొటీన్ స్పాంజీలు, చీజ్ తయారీలో వచ్చే బైప్రాడక్ట్‌లను ఉపయోగించి వారు ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి బంగారాన్ని విజయవంతంగా తీయగలిగారు. అదీ తక్కువ ఖర్చుతోనే వేరు చేయగలిగారు. ఈ ప్రక్రియలో ఒక్క రూపాయి పెట్టుబడి పెడితే.. రూ. 50 రూపాయల విలువైన బంగారాన్ని పొందవచ్చని వివరించారు.
20 ఏళ్ల కిందటి కంప్యూటర్ల మదర్ బోర్డులపై శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. వారి అధ్యయనం ప్రకారం, ఈ వేస్ట్ నుంచి 22 క్యారట్‌ల నాణ్యమైన 450 మిల్లిగ్రాముల బంగారాన్ని వేరు చేయగలిగారు. పాత కంప్యూటర్లను, లేదా ఎలక్ట్రానిక్ వేస్ట్ సేకరించడం, వాటి నుంచి బంగారం వేరు చేయడానికి అవసరమైన పదార్థాలను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే ఖర్చు.. ఈ ప్రక్రియ ద్వారా పొందిన బంగారం విలువ కంటే 50 రెట్లు తక్కువ ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.
అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన కథనం ప్రచురించారు. 450 మిల్లిగ్రాముల బంగారాన్ని శాస్త్రవేత్తలు తీయగలిగారు. ఇది 91 శాతం బంగారం. మిగిలినవి కాపర్ అణువులు ఉంటాయి.
COMMENTS