NRI is paying off Matrubhumi's debt. Financial assistance to poor students
మాతృభూమి ఋణం తీర్చుకుంటున్న ఎన్నారైలు.. పేద విద్యార్థులకు ఆప్త ఆర్థిక సాయం.
సేవ చేయాలనే దృక్పథంతో కొందరు మిత్రులు ఒకటై ఓ సంస్థను స్థాపించి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆ సంస్థ. కన్నతల్లి లాంటి మాతృభూమి ఋణం తీర్చుకునేలా తెలుగు నేలపై పుట్టిన తెలుగు ప్రజలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు. వారి సేవలకు హద్దులు లేవంటూ ఇప్పటికే కోట్లాది రూపాయలు ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాయం అందిస్తూ బాసటగా నిలిచారు. వారి సేవలకు ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు లభించింది. రానున్న రోజుల్లో ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని యోచిస్తున్నారు అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇంతకీ తెలుగు ప్రజలకు అంతగా సేవ చేస్తున్న ఆ సంస్థ పేరు ఏమిటి..? ఆ సంస్థ తరఫున ఇప్పటివరకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ తెలుగు వారి మన్నలు పొందుతున్నారు భారత సంతతికి చెందిన తెలుగు వాళ్లు. అమెరికాలో స్థిరపడిన కొందరు మిత్రులు కలిసి ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దానిద్వారా తెలుగు ప్రజలకు సేవలందించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 2008లో అమెరికాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) అనే సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా 35 రంగాల్లో సేవలు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
అందులో భాగంగా ముఖ్యమైనది విద్యకు ప్రోత్సాహం అనే కార్యక్రమం చేపట్టారు ఆప్తా ప్రతినిధులు. గత 15 సంవత్సరాలుగా విద్యకు ప్రోత్సాహం కార్యక్రమం ద్వారా చదువుపై ఎంతో ఆసక్తి ఉండి, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వారి చదువు సాగక ఇబ్బంది పడే విద్యార్థుల కోసం సాయం చేయాలని భావించారు. ఇప్పటికే పద్నాలుగు కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్ రూపంలో విద్యార్థులకు అందజేశారు. అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 184 మంది వివిధ తరగతులకు చెందిన విద్యార్థులకు రూ.28.40 లక్షలు చెక్కుల ద్వారా అందించారు.
పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అభ్యసించడంలో ఆర్థిక ఇబ్బందులు అడ్డు రాకూడదనే సంకల్పంతో వారి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, డాక్టర్ శానం విజయమోహన్, మేకా అప్పాయమ్మ, బొడ్డు వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
COMMENTS