Hero: Hero new scooty with bluetooth connectivity.. Price is also low
Hero: బ్లూటూత్ కనెక్టివిటీతో హీరో కొత్త స్కూటీ.. ధర కూడా తక్కువేనండోయ్.
మారుతోన్న కాలంతోపాటు వాహనాల తయారీలోనూ మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ టూ వీలర్, ఫోర్ ఫీలర్‌లలో అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో మార్కెట్లోకి కొత్త స్కూటీని లాంచ్ చేసింది. హీరో ప్లెజర్ ఎక్స్‌టెక్ పేరుతో ఈ కొత్త స్కూటీని తీసుకొచ్చింది. ఇంతకీ ఈ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్కూటీని అద్భుతమైన డిజైన్‌తో రూపొందించారు. ఈ స్కూటీనికి సైడ్ ప్యానెల్‌లు, ఫ్రంట్ ఆప్రాన్ సెటప్‌తో తీసుకొచ్చారు. ఈ స్కూటీ 110.9cc ఇంజన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజన్ 8bhp శక్తిని, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటీలో 4.8 లీటర్ల పెట్రోల్ సామర్థ్యంతో ట్యాంక్‌ను డిజైన్ చేశారు. స్కూటీని కేవలం 106 కిలోల బరువుతో రూపొందించారు. ఈ స్కూటీలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించారు.
స్మార్ట్ ఫీచర్లతో రూపొందించిన ఈ స్కూటీలో ఎస్ఎంఎస్ ఇండికేషన్స్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీని అందించారు. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌లను స్క్రీన్‌పై చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌ను స్కూటీని బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకుంటే డ్యాష్‌బోర్డ్‌పై కాల్స్‌ను కూడా చూసుకోవచ్చు. అలాగే ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను ఇచ్చారు. ఐ3ఎస్ టెక్నాలజీని ఇందులో అందించారు.
ఈ స్కూటీలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, ఇంజన్ దెబ్బతినకుండా ఉండడానికి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఇచ్చారు. దీంతో సైడ్ స్టాండ్ వేయగానే ఇంజన్ ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఇందులో 20.4 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ను ఇచ్చారు. డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, 10-అంగుళాల అల్లాయ్ వీల్‌లు, 220 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ (ZX వేరియంట్‌లో మాత్రమే) వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ స్కూటీ బేసిక్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైజ్ రూ. 79,738గా నిర్ణయించారు.
COMMENTS