Google - Photomath : A special app for students has arrived
Google - Photomath : విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ వచ్చేసింది.. ఇకపై మ్యాథ్స్ అంటే భయపడాల్సిన పనిలేదు!
Google Photomath App : చదువుకునే సమయంలో విద్యార్థులకు మ్యాథ్స్ అంటే చాల మందికి భయం ఉంటుంది. ఎందుకుంటే గణిత సమస్యలను పరిష్కరించడం అందరికీ అంత సులభం కాదు కాబట్టి. గణిత సమస్యలను పరిష్కరించడం చాలా మంది విద్యార్థులకు కష్టమైన పని. దీనివల్ల చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్ అంటేనే వణికిపోతుంటారు. మ్యాథ్స్ సబ్జెక్టుకు దూరంగా ఉంటుంటారు. అదే సమయంలో గణితాన్ని ఇష్టపడే విద్యార్థులు కూడా ఉంటారనుకోండి! అయితే.. మ్యాథ్స్ అంటే ఇష్టపడే, భయపడే విద్యార్థుంలదరికీ సహాయం చేయడానికి Google నుండి ఒక యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ఏంటో తెలుసా..?
Google కొత్తగా లాంచ్ చేసిన ఫోటోమ్యాథ్ (Photomath) యాప్‌తో ఇది సాధ్యమే. ఇకపై మీరు మ్యాథ్స్ ప్రాబ్లెమ్ పరిష్కరించాలి అంటే ఈ యాప్ లో ఒక్క ఫోటో తీస్తే చాలు మీకు సమాధానం వస్తుంది. ఈ యాప్ ఒక స్మార్ట్ కెమెరా కాలిక్యులేటర్ మరియు మ్యాథ్స్ అసిస్టెంట్ యాప్. ఇందులో, ఫోటో తీయడం ద్వారా మ్యాథ్స్ ఈక్వేషన్ లు పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కనుక ఇది మీ కష్టమైన త్రికోణమితి లేదా బీజగణిత సమీకరణం కావచ్చు.. ఈ యాప్ దశల వారీ పరిష్కారాలతో దాన్ని అర్థం చేసుకోవడంలో అక్షరాలా మీకు సహాయం చేస్తుంది. ఇది మీకు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా పని చేస్తుంది.
ఈ Photomath యాప్ Google Play Storeలో అందుబాటులో ఉంది. ఇది గణిత విద్యార్థులకు సహాయపడే గూగుల్ ప్రత్యేక యాప్. గూగుల్ ఈ యాప్‌ను 2023లో కొనుగోలు చేసింది. ఈ యాప్‌ను స్మార్ట్ కెమెరా కాలిక్యులేటర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కెమెరా కాలిక్యులేటర్ లాగా పనిచేస్తుంది. ఇది ఏదైనా గణిత సమస్య చిత్రాన్ని చూసి దానిని లెక్కించడం ప్రారంభించి దాని పరిష్కారాన్ని కనుగొంటుంది. విద్యార్థులు ఏదైనా గణిత ప్రశ్నకు సంబంధించిన ఫోటోను ఈ గూగుల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే.. యాప్ ఆ ప్రశ్నకు దశల వారీగా పరిష్కారాన్ని అందిస్తుంది.
COMMENTS