BEL Careers : 517 Trainee Engineer Jobs in Bharat Electronics.
BEL Careers : భారత్ ఎలక్ట్రానిక్స్లో 517 ట్రైనీ ఇంజినీర్ జాబ్స్.. నెలకు రూ.40,000 వరకూ జీతం
ప్రధానాంశాలు:
- బెల్ జాబ్ రిక్రూట్మెంట్ 2024.
- 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీ.
- మార్చి 13 దరఖాస్తులకు చివరితేది.
BEL Recruitment 2024 : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరు కాంప్లెక్స్- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్ఎల్ఎస్ అండ్ ఎస్సీబీ ఎస్బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. మార్చి 13 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం :
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు: 517
జోన్ల వారీ ఖాళీలు: సెంట్రల్ జోన్- 68, ఈస్ట్ జోన్- 86, వెస్ట్ జోన్- 139, నార్త్ జోన్- 78, నార్త్ ఈస్ట్ జోన్- 15, సౌత్ జోన్- 131 ఉన్నాయి.
అర్హత: బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర సమాచారం :
గరిష్ఠ వయోపరిమితి: బీఈ/ బీటెక్ అభ్యర్థులకు 28 ఏళ్లు.. ఎంఈ/ ఎంటెక్ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000గా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.150+ 18 శాతం జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13, 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS