If you miss the train, can you board another train with the same ticket? Travelers should keep these things in mind.
రైలు మిస్ అయితే అదే టికెట్ తో మరో రైలును ఎక్కవచ్చా. ప్రయాణికులు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.
మనలో చాలామంది ఏడాదికి కనీసం ఒకసారైనా రైలు ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు అనుకున్న సమయానికి రైలు ఎక్కలేకపోవడం వల్ల ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటాయి.
ఒక నిమిషం స్టేషన్ కు ఆలస్యంగా రావడం వల్ల ట్రైన్ మిస్ అయిన వాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే రైలు ప్రయాణికులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
రైలు ప్రయాణికులు కొనుగోలు చేసిన టికెట్ ఆధారంగా మరో రైలులో ప్రయాణం చేసే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. సాధారణంగా ఒక ట్రైన్ కోసం బుక్ చేసుకున్న టికెట్ ను మరో ట్రైన్ కోసం ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. మరో ట్రైన్ లో ప్రయాణించాలని భావించే ప్రయాణికులు మళ్లీ కొత్తగా టికెట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్స్ అన్ని టికెట్లకు వర్తించవు.
తత్కాల్ టికెట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్లను కలిగి ఉన్నవాళ్లు మాత్రం కొన్ని రూల్స్ కు అనుగుణంగా మరో రైలులో ప్రయాణించే అవకాశాలు ఉంటాయి. జనరల్ టికెట్ ను కొనుగోలు చేసిన వాళ్లు మాత్రం తమ దగ్గర ఉన్న జనరల్ టికెట్ సహాయంతో ప్యాసింజర్ రైలులో ప్రయాణం చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో మాత్రం ట్రైన్ మిస్ అయితే టికెట్ డబ్బులు వాపసు పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. erail.in వెబ్ సైట్ సహాయంతో టికెట్ రీఫండ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ట్రైన్ బయలుదేరిన గంటలోపు టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ను నమోదు చేయడం ద్వారా రైలు మిస్ అయితే అదే టికెట్ తో మరో రైలులో ప్రయాణించే అవకాశం ఉంటుంది.
COMMENTS