Yash Jain
18 ఏళ్ల వయస్సులోనే కంపెనీ ఏర్పాటు.. రూ.55 కోట్లకు చేరిన టర్నోవర్..
18 ఏళ్ల ప్రాయంలోనే కంపెనీ స్థాపించాడు. రూ.55 కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీగా తీర్చిదిద్దాడు. అతన ఎవరో కాదు నింబస్‌పోస్ట్ వ్యవస్థాపకుడు యష్ జైన్. అతను 18 సంవత్సరాల వయస్సులోనే మరో వ్యక్తి రాజీవ్ ప్రతాప్ తో కలిసి NimbusPostని స్థాపించాడు. ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ కోట్లలో ఉంది. ఈ సంస్థ ఈ-కామర్స్ రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కి చెందిన యష్ జైన్, తన వ్యవస్థాపక విజయానికి అతని బలమైన విద్యా నేపథ్యం కారణమని పేర్కొన్నాడు. అతను 2018లో షిప్పింగ్ కంపెనీ నింబస్‌పోస్ట్‌ని స్థాపించాడు. ఈ కంపెనీ తక్కవు కాలంలోనే కస్టమర్ మద్దతు పొందింది. నింబస్‌పోస్ట్ తన కస్టమర్ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి తగిన సేవలను అందించడం ద్వారా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది.
ఈ కంపెనీ జాతీయ, అంతర్జాతీయ రవాణా కోసం షిప్పింగ్ సొల్యూషన్స్ నుంచి గ్లోబల్ వేర్‌హౌసింగ్ సేవల వరకు ఆధారపడదగిన, సమర్థవంతమైన లాజిస్టిక్స్ సొల్యూషన్‌లను అందించడం కోసం అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను నెలకొల్పింది. నింబస్‌పోస్ట్ 2022లో రూ. 55 కోట్ల టర్నోవర్‌ను సృష్టించింది. వారి విజయాలను చూసి ఆశ్చర్యపోని యష్ జైన్, అతని బృందం 2024 నాటికి రూ. 350 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
నింబస్‌పోస్ట్ ప్రతిరోజూ రెండు మిలియన్లకు పైగా లావాదేవీలను నిర్వహిస్తోంది. FedEx, Delhivery, Blue Dart, Gati, Xpressbees, Shadowfax వంటి ముఖ్యమైన డెలివరీ భాగస్వాములతో పని చేస్తోంది. వారి అసాధారణ విజయానికి ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించడంతోపాటు రెండు వందల మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, లాజిస్టిక్స్ నిపుణులు కారణమని చెబుతున్నారు.
COMMENTS