Vehicle RC: How to Update Address in Your Vehicle RC? Online as easy as this
Vehicle RC: మీ వాహనం ఆర్‌సీలో అడ్రస్ అప్‌డేట్ చేయడం ఎలా? ఆన్‌లైన్‌లోనే ఇలా ఈజీగా..
మనం ఏదైనా వెహికిల్ తీసుకుంటే దానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) అనేది తప్పనిసరి. ప్రభుత్వ అధికారులు దీనిని జారీ చేస్తారు. ఇది మోటార్ వెహికిల్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దీంట్లో అన్ని వివరాలు సరిగ్గా ఉండాలి. ఏదైనా మారితే కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు ఆర్సీలో అడ్రస్ ఎలా అప్‌డేట్ చేయాలో చూద్దాం.
RC Update Online: మీ దగ్గర వాహనం ఉందా? రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ఉందా? అందులో వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా? ఒకవేళ మీరు మీ పర్మినెంట్ అడ్రస్‌ను మార్చినట్లయితే .. మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో కూడా అడ్రస్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మోటార్ వాహనాల చట్టం -1988 ప్రకారం.. అడ్రస్ మారిన 14 రోజుల్లోగా అప్డేట్ చేయడం అనేది తప్పనిసరి. దీనిని ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. దీని కోసం కొన్ని డాక్యుమెంట్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత అడ్రస్‌ను ధ్రువీకరిస్తూ ప్రూఫ్ ఉండాలి.
ఆర్సీ అనేది సదరు వాహనం యజమాని (ఓనర్) ఎవరు అనేది ధ్రువీకరిస్తుంది. ఇంకా వెహికిల్ ఐడెంటిటీకి కూడా ఇదే కీలకం. అందుకే వాహనం రోడ్డుపైకి ఎక్కాలన్నా ఈ ఆర్సీని తప్పనిసరి చేసింది. ఇంకా ఆ వాహనం మోటార్ వాహన నిబంధనలకు కట్టుబడి అవసరమైన నియంత్రణ ప్రమాణాలకు లోబడి ఉందని.. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. చట్టబద్ధంగా నడుచుకుంటున్నట్లు చెప్పాలన్నా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా.. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు ఈ ఆర్సీలో ఓనర్ వివరాలు, అడ్రస్ సహా అన్నీ సరిగ్గా, కచ్చితత్వంతో ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం నుంచి దీని కోసం పరివాహన్ సేవా వెబ్‌సైట్ కూడా ఉంది. దీంట్లో అన్ని మార్గదర్శకాలు, ఇతర వివరాలు వంటివి ఉంటాయి. మీ దగ్గర ఆర్సీ ఉందనుకుందాం. తర్వాత మీరు ఒకవేళ అడ్రస్ మారినట్లయితే దాంట్లో కచ్చితంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా పరివాహన్ వెబ్‌సైట్లో చూడొచ్చు. ఇక ఆర్సీలో అడ్రస్ అప్‌డేట్ కోసం ఏమేం డాక్యుమెంట్లు కావాలో.. ఆన్‌లైన్‌లోనే అడ్రస్ ఎలా అప్డేడ్ చేసుకోవాలనేది చూద్దాం.
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే..
- ఫాం-33 అప్లికేషన్
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- కొత్త అడ్రస్ ప్రూఫ్
- ఇన్సూరెన్స్ సర్టిఫికెట్
- పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్
- అవసరమైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్
- స్మార్ట్ కార్డ్ ఫీ
- పాన్ కార్డు (అవసరమైతేనే)
- ఛాసిస్, ఇంజిన్ పెన్సిల్ ప్రింట్
- ఓనర్ ధ్రువీకరణ కోసం సంతకం
ఎలా అప్డేట్ చేసుకోవాలి..?
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వాహన్ ఇ-సర్వీసెస్అధికారిక పోర్టల్‌కు వెళ్లాలి.
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, సెక్యూరిటీ కోడ్‌తో లాగిన్ చేయాలి.
లాగిన్ చేశాక.. ఆన్‌లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. వెహికిల్ రిలేటెడ్ సర్వీసెస్‌లోకి వెళ్లాలి.
తర్వాత మీ వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్ చివరి ఐదంకెలు ఎంటర్ చేయాలి.
జనరేట్ ఓటీపీపై క్లిక్ చేసి.. మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
తర్వాత ఛేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ RC ని సెలక్ట్ చేసుకొని ఫాం సబ్మిట్ చేయాలి.
ఇన్సూరెన్స్ వివరాలతో సహా అడిగిన అన్ని డీటెయిల్స్ అందించాలి.
అప్‌లోడ్ డాక్యుమెంట్స్ (DMS) ఆప్షన్‌తో అడిగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
మీరు అందుబాటులో ఉండే తేదీలో అపాయింట్‌మెంట్ డేట్ షెడ్యూల్ చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి.
తర్వాత రిసిప్ట్ వస్తుంది. ప్రింట్ తీస్కొని ఆ రిసిప్ట్ సహా ఒరిజినల్ డాక్యుమెంట్లతో వెరిఫికేషన్ కోసం ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాలి. తర్వాత మీ అడ్రస్.. ఆర్సీలో అప్డేట్ అవుతుంది.
COMMENTS