TSRJC CET 2024
తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం.
మార్చి-2024 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు శుభవార్త!.
తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం (MPC/ BPC/ MEC) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
TSRJC CET - 2024 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..
తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కొరకు టీ.ఎస్.ఆర్.జె.సి - సెట్ 2024 ప్రవేశ పరీక్ష ప్రకటన Rc.No.10/TSRJC-CET/C1- 2/2024, తేదీ:25.01.2024 న విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో; అనగా.. మార్చి 2024 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణలోని అన్ని (33) జిల్లాల విద్యార్థిని, విద్యార్థులు ఈ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 31.01.2024 నుండి 16.03.2024 వరకు సమర్పించవచ్చు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపర్చిన అభ్యర్థులకు రిజర్వేషన్ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉన్నాయి. అవి;
జనరల్ బాయ్స్ - 15,
జనరల్ గర్ల్స్ - 20.
తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు క్రింద చూపబడిన అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయి. అవి;
ప్రయోగశాలలు, లైబ్రరీలు, రీడింగ్ రూమ్ మరియు చక్కటి భౌతిక వసతులతో ఆట మైదానాలు.
ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత బోర్డింగ్ మరియు వసతి తో ఉచిత విద్యను అందిస్తారు.
ఎంపికైన విద్యార్థులకు పై సౌకర్యాలు అందించబడతాయి.
ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
NET, JEE-MAINS, Advanced కోర్సులకు శిక్షణలు ఇస్తారు.
అర్హత ప్రమాణాలు :
విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
మార్చ్-2024 లో 10వ తరగతి పరీక్షలో మొదటి అటెంప్ట్ లో అర్హత సాధించగలగాలి.
OC విద్యార్థులు కనీసం 6 GPA,
BC/ SC/ ST విద్యార్థులు కనీసం 5 GPA,
English సబ్జెక్టులో కనీసం 4 GPA తో ఉత్తీర్ణత సాధించగలగాలి.
పరీక్ష సెంటర్ల వివరాలు :
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 జిల్లా హెడ్ క్వార్టర్లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;
ఆదిలాబాద్,
వరంగల్,
కరీంనగర్,
ఖమ్మం,
నిజామాబాద్,
నలగొండ,
మహబూబ్నగర్,
హైదరాబాద్,
రంగారెడ్డి,
సంగారెడ్డి,
సిద్దిపేట,
మెదక్.. మొదలగునవి.
(అభ్యర్థులు ఏదైనా పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేయవచ్చు).
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు:
ప్రశ్న పత్రం తెలుగు ఇంగ్లీష్ మద్యమాల్లో ఉంటుంది.
పరీక్ష సమయం (2.5) రెండున్నర గంటలు.
మల్టిపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
పదవ తరగతి, తెలంగాణ రాష్ట్ర సిలబస్ అనుగుణంగా ప్రశ్నలు అడుగుతారు.
సమాధానాలను ఓఎంఆర్ షీట్ పై పెన్ తో బబ్లింగ్ చేయాలి.
ఎంపిక విధానం :
రాత (ప్రవేశ) పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితా ముందుగా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడుతుంది. తదుపరి, అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ అలాట్మెంట్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.01.2024,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.03.2024.
ప్రవేశ పరీక్ష నిర్వహించు తేదీ :: 21.04.2024 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS