T.S.Kalyanaraman: Starting a business with a loan.. Today Rs. 17,000 crore turnover..
T.S.Kalyanaraman: అప్పుతో వ్యాపారం ప్రారంభం.. నేడు రూ. 17,000 కోట్ల టర్నోవర్..
కలలు కనండి.. వాటి సకారం చేసుకోండి అని స్వర్గీయ అబ్దుల్ కలామ్ చెప్పారు. అయన చెప్పినట్లుగానే కలలను సకారం చేసుకున్నాడుకళ్యాణరామన్ . అప్పు చేసి సొంతంగా నగల దుకాణం తెరిచిన ఆయన ఇప్పుడు ఆభరణాల బ్రాండ్‌నే సృష్టించాడు. దేశంలోని వివిధ నగరాల్లో షాపులు ఓపెన్ చేశారు. కళ్యాణ్ జ్యువెలర్స్ పేరుతో నగల వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు కళ్యాణరామన్(T.S.Kalyanaraman). టీఎస్ కళ్యాణరామన్ జీవితంలో ఇంత విజయాన్ని ఎలా సాధించాడో తెలుసుకుందాం.
కల్యాణరామన్ ఏప్రిల్ 23, 1947న కేరళలోని త్రిసూర్‌లో జన్మించారు. కళ్యాణరామన్ తండ్రి టిఆర్ సీతారామ్మయ్య బట్టల వ్యాపారి. కళ్యాణరామన్ తాత పూజారి, కానీ తరువాత వ్యాపారవేత్తగా మారారు. కళ్యాణరామన్ 12 ఏళ్ల నుంచి తండ్రికి షాపులో సహాయం చేసేవాడు. అక్కడ వ్యాపారానికి సంబంధించిన సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. తన గ్రాడ్యుయేషన్‌ను కొనసాగించడానికి కేరళలోని కేరళ వర్మ కళాశాలలో చేరాడు. వాణిజ్యశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
కళ్యాణరామన్‌కు కుటుంబ వ్యాపారంపై ఆసక్తి లేదు. కొంతకాలం వేరే చోట పనిచేసి రూ.25 లక్షలు కూడబెట్టాడు. కానీ ఆ డబ్బు నగల దుకాణం తెరవడానికి సరిపోలేదు. దీంతో బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అతని వద్ద మొత్తం రూ.75 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తంతో త్రిసూర్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ పేరుతో నగల దుకాణాన్ని ప్రారంభించాడు. కళ్యాణరామన్ తన వ్యాపారం విజయవంతం కావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ తరువాత కళ్యాణ్ జ్యువెలర్స్ దుకాణాలు కేరళలోకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభించారు.
ప్రస్తుతం కళ్యాణ్ జ్యువెలర్స్ కు దేశంలో 200 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ వ్యాపారం దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరించింది. కళ్యాణ్ జ్యువెలర్స్‌కు యుఎఇ, ఖతార్, కువైట్, ఒమన్‌లలో 30 షోరూమ్‌లు ఉన్నాయి. టీఎస్ కళ్యాణరామన్ భారతదేశంలోని అత్యంత ధనిక ఆభరణాల వ్యాపారిగా ఉన్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 17,000 కోట్లు దాటింది.
COMMENTS