TS Vikarabad DHMO MLHPs Recruitment 2024
జిల్లా కలెక్టరేట్ మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు..దరఖాస్తు చేసుకోండి..
GNM/B.Sc Nursing/ గ్రాడ్యుయేషన్, బీ.ఈ/ బీ.టెక్ మరియు MBBS అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, కలెక్టరేట్, D.M.H.O మరియు NHM వికారాబాద్ జిల్లా శుభవార్త చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా!.. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ 24.02.2024 న అధికారిక వెబ్సైట్లో ప్రచురించబడింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 29.02.2024 సాయంత్రం 03:00. లోపు లేదా అంత కంటే ముందు సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 54.
పోస్టులు :
- స్టాఫ్ నర్స్,
- మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్,
- జిల్లా డాటా మేనేజర్,
- మెడికల్ ఆఫీసర్,
- ఫార్మసిస్ట్,
- డాటా ఎంట్రీ ఆపరేటర్.. మొదలగునవి.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. GNM/ B.SC(Nursing)/MBBS/ MBBS (ఆయుష్) గ్రాడ్యుయేషన్, బీ.ఈ, బీ.టెక్ లో అర్హత సాధించి ఉండాలి.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
08.03.2025 నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో (5-10 సంవత్సరాల వరకు) సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, అనుభవం ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
తుది ఎంపిక జాబితా అధికారిక వెబ్సైట్లో ప్రచురించబడుతుంది.గౌరవ వేతనం:
ఎంపికైన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHPs), స్టాఫ్ నర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫీసర్, జిల్లా డాటా మేనేజర్ లకు పోస్టులను అనుసరించి DHMO NHM ప్రమాణాల ప్రకారం ప్రతి నెల అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.02.2024 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :: 29.02.2024 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS