Success Story: Born abroad..Rs 42,000 crore business leader in India..Success
Success Story: పరదేశంలో పుట్టాడు.. ఇండియాలో రూ.42,000 కోట్ల వ్యాపారాధినేత.. సక్సెస్
Sunder Genomal: జీవితంలో సక్సెస్ కావాలంటే కావాల్సింది ఓపిక, స్థిరంగా ఒకే వ్యాపార ఆలోచనపై దృష్టి పెట్టి పనిచేస్తే విజయం తథ్యం. ఇదే విషయాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో నిరూపించి చూపించారు. ఎక్కడున్నాం అనేది కాదు ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యం.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది సుందర్ జెనోమల్ అనే బ్రిటీష్ ఇండియన్ వ్యాపారవేత్త గురించి. వస్త్ర వ్యాపార పరిశ్రమలో విజయానికి ఒక గుర్తింపుగా సుందర్ నిలిచారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పుట్టి పెరిగిన సుందర్ ప్రయాణంలో ఎక్సలెన్స్ కోసం ఎడతెగని అన్వేషణ ఉంటుంది. DeLaSalle విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తర్వాత వస్త్ర పరిశ్రమలోని వివిధ కోణాల్లో మూడు దశాబ్దాలుగా తన నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకున్నారు.
అలా 1994లో సుందర్ తన సోదరులతో కలిసి బెంగళూరు కేంద్రంగా పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ఫిలిప్పీన్స్ నుంచి ఇండియాకు వారిని తరలిచింది. సుందర్ కుటుంబం మూడు దశాబ్ధాల పాటు ఫిలిప్పీన్స్‌లో ఇన్నర్ వేర్ జాకీ బ్రాండ్ ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ కలిగి ఉంది. వారు ఇదే వ్యాపారాన్ని కొనసాగించి ఐకానిక్ జాకీ బ్రాండ్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేశారు. ప్రస్తుతం పేజ్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తున్న సుందర్ కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పేజ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.41,952 కోట్లకు చేరుకుంది. దీంతో జాకీ బ్రాండ్ దుస్తుల తయారీ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద లైసెన్సుదారుల్లో ఒకటిగా మారింది. నవంబర్ 11, 2023 నాటికి సుందర్ జెనోమల్ కుటుంబ నికర విలువ రూ.23,200 కోట్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. ఈ అద్భుతమైన విజయగాథ వ్యాపార ప్రపంచంలోని సంక్లిష్టతలను నావిగేట్ చేయగల, సరిహద్దులను మించిన సామ్రాజ్యాన్ని నిర్మించగల సుందర్ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది. ఫిలిప్పీన్స్ నుంచి భారతదేశానికి సుందర్ జెనోమల్ ప్రయాణం.. విజయం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోంది.
COMMENTS