Success Story: 13 consecutive failures.. Currently the creator of Rs. 40 thousand crore company is a success..
Success Story: 13 వరుస అపజయాలు.. ప్రస్తుతం రూ.40 వేల కోట్ల కంపెనీ సృష్టికర్త సక్సెస్..
Ankush Sachdeva: నిబద్ధతతో ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగితే విజయం సాధ్యమని ఈ స్టార్టప్ వ్యవస్థాపకులు నిరూపించారు. కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి అంకురాలను ఏర్పాటు చేసి దాదాపు 13 పరాజయాల నుంచి వారు ఎంతో నేర్చుకున్నారు.
అపజయాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగిన అంకుష్ సచ్‌దేవా సచిన్ ఫాన్స్ చేసిన ఒక పని నుంచి పుట్టిందే షేర్‌చాట్ యాప్ ఆలోచన. ఐఐటీలో గ్రాడ్యుయేషన్ సమయంలో తన సీనయర్లను ఒక హ్యాకతాన్ లో కలిశాడు. ఉద్యోగం పట్ల ఆసక్తి లేక తన చుట్టూ ఉన్న సమస్యల నుంచి స్పూర్తిని పొంది అనేక స్టార్టప్స్ సృష్టించాడు. అయితే నెలల వ్యవధిలోనే అవి ఫెయిల్ అయినా నిరాశకు గురికాకుండా కొత్త ఆలోచను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసి చివరికి విజయం సాధించాడు.
ముగ్గురు మిత్రులు రూ.50 లక్షల ప్రారంభపెట్టుబడితో మెుదలుపెట్టిన షేర్‌చాట్ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.40,000 కోట్లకు చేరుకుంది. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా దీనిని వారు రూపొందించారు. జనవరి 2015లో షేర్‌చాట్ మాతృ సంస్థ మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించబడింది. కంటెంట్ క్రియేటర్ల అవసరాలను దృష్టిలోకి తీసుకుని ప్రాంతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళంలలో తొలుత సేవలను విస్తరించింది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తన వ్యాపారాన్ని కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం చేయకుండా యూఎస్, యూరప్ సహా మరిన్ని దేశాలకు విస్తరించింది. దాదాపు 1,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ కోట్ల మంది యూజర్లకు తక్కువ కాలంలోనే చేరువైంది. ఐఐటీ ఖాన్‌పూర్ లో చదువుకున్న అంకుష్ సచ్‌దేవా, భాను ప్రతాప్ సింగ్, ఫరీద్ అహ్సన్ అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందుకు సాగి కంపెనీని స్థాపించి కొనసాగిస్తున్నారు. వారు కంపెనీని ప్రారంభించిన తొలినాళ్లలో ఆఫీసునే ఇంటిగా మార్చుకుని జీవించటం గమనార్హం. ఇలా తమ చుట్టూ కనిపించిన సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తూ నెలకొల్పిన షేర్‌చాట్ యాప్ ద్వారా సక్సెస్ సాధించారు.
COMMENTS