SSC Selection Post Phase 12: Notification release for 2049 Govt Jobs.
SSC Selection Post Phase 12: 2049 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
ప్రధానాంశాలు:
- ఎస్‌ఎస్‌సీ జాబ్ రిక్రూట్‌మెంట్ 2024.
- 2049 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల.
- దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
- మార్చి 18 దరఖాస్తులకు చివరితేది.
SSC Selection Post Phase 12 Recruitment 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా సెలక్షన్ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లో 2049 ఖాళీలను భర్తీ చేయనుంది. 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇక.. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్‌లేషన్ బ్యూరో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం :
మొత్తం పోస్టులు : 2,049
పోస్టులు: లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్‌మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్‌మాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్-కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్ తదితర పోస్టులున్నాయి.
అర్హత: పోస్టులను బట్టి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనిష్ఠంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్- టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
పరీక్ష విధానం: ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్‌మెటిక్ స్కిల్) (25 ప్రశ్నలు, 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) (25 ప్రశ్నలు, 50 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 26, 2024
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 18, 2024
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 19, 2024
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: మే 6 నుంచి 8 వరకు నిర్వహిస్తారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS