PAN Card Rules: Alert for PAN card holders.. Heavy fine for doing this mistake
PAN Card Rules: పాన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే భారీ జరిమానా
PAN Card Rules: పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్ కార్డ్) అనేది భారతదేశ గుర్తింపు కార్డు. ఆదాయపు పన్ను శాఖ ఈ గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. దేశంలోని వివిధ ఆర్థిక లావాదేవీలకు ఈ పాన్ నంబర్ అవసరం. ఒక వ్యక్తి లేదా సంస్థ ఆర్థిక లావాదేవీలు ఈ సంఖ్య ఆధారంగా గుర్తిస్తారు. పాన్ ఆధారంగా ఆదాయపు పన్ను వసూలు చేస్తారు. బ్యాంకు ఖాతా తెరవడానికి కూడా ఈ గుర్తింపు కార్డు అవసరం. అయితే ఈ పాన్ కార్డును కలిగి ఉండటానికి లేదా ఉంచుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. మీరు పాన్ కార్డుకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించకపోతే మీరు భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవచ్చు.
దేశంలోని ప్రతి వ్యక్తి తన పేరు మీద పాన్ నంబర్‌ను సృష్టించుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు మీద రెండు పాన్ నంబర్లు ఉంటే అది నేరం. అలా అయితే, శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. డూప్లికేట్ పాన్ కార్డ్ కలిగి ఉండటం సరైనది కాదని గుర్తించుకోండి. ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నట్లయితే ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన చర్యలు తీసుకుంటుంది.
సాధారణంగా ఒక వ్యక్తి పేరు మీద ఒక పాన్ నంబర్ మాత్రమే జారీ చేస్తారు. కానీ కొన్ని సమయాల్లో కొందరు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు పొందుతున్నారు. ఇలా జరిగితే, వెంటనే ఒక నంబర్‌ను క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉంటే నిర్భయంగా ఆదాయపు పన్ను శాఖకు అందించాల్సి ఉంటుంది. చాలా మంది అక్రమంగా గుర్తింపులను నకిలీ చేయడం ద్వారా ఎక్కువ పాన్ నంబర్‌లను సృష్టించుకుంటున్నారు. ఒక వేళ మీరు ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లు గుర్తించినట్లయితు 10 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఏదైనా మోసం జరిగితే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అందుకే ఆదాయపు పన్ను శాఖ కూడా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వారిపై ఓ కన్నేసి ఉంచుతుంది.
COMMENTS