Kanika Tekriwal: The woman who conquered cancer and became the head of Rs.420 crores..
Kanika Tekriwal: క్యాన్సర్ ను జయించి రూ.420 కోట్లకు అధిపతిగా మారిన మహిళ..
20 సంవత్సరాల వయస్సులోనే క్యాన్సర్.. అంతా ఆమెపై ప్రాణాలపై ఆశను వదిలేసుకున్నారు. కానీ ఆమె మాత్రం చావుతో పోరాటం చేశారు. మృత్యువును జయించారు. ఆపై జీవితాన్నే జయించారు. ఆమె జెట్ సెట్ గో వ్యవస్థాపకురాలు, సీఈఓ కనికా టేక్రివాల్. జెట్ సెట్ గో చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్‌లను నిర్వహించే, ఎగురవేసే విమాన అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీగా ఉంది. కనికా టేక్రివాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నారు.
ఆమె దాదాపు రూ. 420 కోట్ల భారీ నికర విలువను కలిగి ఉన్నారు. 22 సంవత్సరాల వయస్సులో కనికా టేక్రివాల్ క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత తన సొంత ఏవియేషన్ ఆధారిత స్టార్టప్‌ను స్థాపించాలని నిర్ణయించుకుంది. ఆమె వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆమె 10 ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉంది. విమానాల లీజింగ్ పరిశ్రమలో భారతదేశానికి అగ్రగామిగా ఉన్న జెట్ సెట్ గో దాదాపు 100,000 మంది ప్రయాణికులను సౌకర్యవంతంగా రవాణా చేసింది.
6,000 విమానాలను విజయవంతంగా అమలు చేసిన రికార్డుతో కంపెనీ ఈ రంగంలో బలమైన ముద్ర వేసింది. 1990లో మార్వాడీ కుటుంబంలో జన్మించిన కనికా టేక్రివాల్ 2012లో జెట్ సెట్ గోని స్థాపించారు. ఆమె ఆమె లారెన్స్ స్కూల్, లవ్‌డేల్ లో చదివారు. భోపాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సీనియర్ సెకండరీ స్కూల్‌లో కూడా చదువుకుంది. కోవెంట్రీ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
హురున్ రిచ్ లిస్ట్‌లో ఉన్న యువ ధనిక మహిళల్లో కనికా టేక్రివాల్ ఒకరు. కనికా టేక్రివాల్ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. కనికా తన వ్యాపార నైపుణ్యాల కోసం అనేక అవార్డులు, గౌరవాలను పొందారు. ఇందులో భారత ప్రభుత్వం అందించే నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్స్ కూడా ఉన్నాయి.
COMMENTS