Job Mela in Nalgonda
నల్గొండలో మెగా జాబ్‌మేళా.. 5000కు పైగా ఉద్యోగాలు.. కలెక్టర్ హరిచందన ప్రకటన
Minister Komatireddy Venkat Reddy : తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈనెల 26వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
Mega Job Mela in Nalgonda on February 26th : నిరుద్యోగులకు నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన గుడ్‌న్యూస్ చెప్పారు. నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 26వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. 100కి పైగా కంపెనీల్లో 5000కు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ‘X’ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ జాబ్‌మేళా లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈనెల 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ మెగా జాబ్ మేళా జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సెల్ (TFMC) సహకారంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్‌మెంట్ (TASK) ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యుమె, విద్యార్హత డాక్యుమెంట్‌లను వెంట తీసుకొని రావాలని సూచించారు. అలాగే.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సైతం నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Genpact : జెన్‌ప్యాక్ట్ హైదరాబాద్‌లో కన్సల్టెంట్ పోస్టులు
జెన్‌పాక్ట్ కంపెనీ కన్సల్టెంట్, మాన్యువల్ క్వాలిటీ టెస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
అర్హత: సంబంధిత టెక్నికల్ విభాగంలో బీటెక్ ఉత్తీర్ణత. ఎస్‌డీఎల్‌సీ రిలేషనల్ డేటాబేస్ (పోస్ట్‌గ్రెస్/ ఒరాకిల్) నైపుణ్యాలు. బ్యాంకింగ్/ ఫైనాన్స్ డొమైన్‌లో పని అనుభవం. కమ్యూనికేషన్ నైపుణ్యాలు తదితరాలు కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
COMMENTS