If you learn that language, you will earn Rs.2 lakhs... Register immediately
ఆ భాష నేర్చుకుంటే రూ.2 లక్షల ఆదాయం... వెంటనే రిజిస్టర్ చేసుకోండి.
విదేశీ భాష నేర్చుకుంటే మంచి ఆదాయం సంపాదించవచ్చు. తిరుపతిలో లభిస్తున్న శిక్షణ వివరాలు తెలుసుకోండి.
విదేశీ భాష నేర్పించి ఉద్యోగం ఇప్పించే దిశగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తుంది. జర్మనీలో నర్సింగ్ చదువుకోవడానికి తాజాగా అవకాశం కల్పిస్తుంది గాక్ గో జర్మనీవారి సంయుక్త ఎంఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి చదువుకుంటున్న వారికి జర్మనీ భాషను నేర్పించి జర్మనీ దేశంలో నర్సెస్గా అవకాశం కల్పించడానికి శ్రీకారం చుట్టింది.
ఆ మేరకు తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశా చేతులు మీదగా పోస్టర్ ను కూడ ఆవిష్కరించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. నర్సింగ్ అర్హత 20 సంవత్సరాల నుండి 35 ఏళ్ల వయసు లోపల వారు అర్హులు. ఈ చదువులకు అర్హులు తప్పనిసరిగా ఎమ్మెస్సీ నర్సింగు, ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడ అర్హులే.
తిరుపతి న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్డులో ఏ 1, ఏ2, బి 1, బి 2 స్థాయి వరకు జర్మన్ బాషపై గాక్ గో జర్మనీ వారి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బయోడేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు ఇతర ధ్రువీకరణ పత్రాలతో ట్రైనింగ్ సెంటర్ కు హాజరు కావాలని సూచించారు.
తిరుపతిలో మూడు నెలల పాటు జర్మనీ భాషపై శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో అన్ని వసతులు కల్పిస్తారు. ఇతర సదుపాయాలపై ప్రభుత్వం 50% రాయితీ ఇస్తుంది. ఆసక్తి గలవారు 13వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.2 లక్షల చొప్పున నెల జీతంలో ఉద్యోగం అందిస్తారు. అదనపు సమాచారం కోసం 9505353545,9988853335 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
COMMENTS