How to get TC job in Railways?..Education, Selection Process, other details check here
రైల్వేలో TC ఉద్యోగం ఎలా పొందాలి?..విద్యార్హత,ఎంపిక ప్రక్రియ,ఇతర వివరాలు ఇక్కడ చూడండి.
ఈ ఉద్యోగం ప్రజలకు అత్యంత ఇష్టమైన ఉద్యోగాలలో ఒకటి. ఈ జాబ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి త్వరలో శుభవార్త రానుంది.
Railway TC Salary: భారతీయ రైల్వేలో టిక్కెట్ కలెక్టర్(Ticket collector) ఉద్యోగం పొందాలని చాలా మంది కోరుకుంటారు. ఈ ఉద్యోగం ప్రజలకు అత్యంత ఇష్టమైన ఉద్యోగాలలో ఒకటి. ఈ జాబ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి త్వరలో శుభవార్త రానుంది. భారతీయ రైల్వేలో TC కావాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి తప్పనిసరిగా వివరాలను అందించాలి. దీంతో పాటు డాక్యుమెంట్స్ జతచేసి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కింద ఇచ్చిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవాలి.
రైల్వే TC ఉద్యోగం పొందడానికి విద్యార్హత:
అభ్యర్థి ఏదైనా రాష్ట్రం లేదా సెంట్రల్ బోర్డు నుండి సైన్స్, కామర్స్ లేదా ఆర్ట్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. OBC, SC/STలకు గరిష్ట వయస్సు సడలింపు 3- 5 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము :
అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 500 చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ లేదా ఎస్టీకు చెందిన మహిళా అభ్యర్థులు,అభ్యర్థులు కేవలం రూ.250 చెల్లించవలసి ఉంటుంది. CBTకి హాజరైన తర్వాత పూర్తి వాపసు ఇవ్వబడుతుంది.
టీసీ ఉద్యోగం ఇలా వస్తుంది:
భారతీయ రైల్వేలలో టికెట్ కలెక్టర్ పదవికి ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- వైద్య పరీక్ష, DV
COMMENTS