EPF | How to get EPF money.. What should the job leavers do?
EPF | ఈపీఎఫ్ సొమ్మును ఎలా పొందాలి.. ఉద్యోగం వీడినవారు ఏం చేయాలి?
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఓ ప్రభుత్వ పథకం. రిటైర్మెంట్ తర్వాత వేతన జీవులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఉద్దేశించినది. ఉద్యోగాలు మారుతున్నప్పుడు.. ప్రస్తుత సంస్థ నుంచి కొత్త సంస్థకు మన ఈపీఎఫ్‌ను బదిలీ కూడా చేసుకోవచ్చు.
EPF : ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఓ ప్రభుత్వ పథకం. రిటైర్మెంట్ తర్వాత వేతన జీవులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఉద్దేశించినది. ఉద్యోగాలు మారుతున్నప్పుడు.. ప్రస్తుత సంస్థ నుంచి కొత్త సంస్థకు మన ఈపీఎఫ్‌ను బదిలీ కూడా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగం వీడిన తర్వాత మీ ఈపీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే తప్పక రెండు నెలలు వేచి ఉండాల్సిందే. కాగా, నిబంధనల ప్రకారం ఈ సమయంలో నెల రోజులపాటు నిరుద్యోగులుగా ఉంటే వారి ఈపీఎఫ్ సొమ్ములో 75 శాతం, రెండు నెలలు ఉద్యోగం దొరక్కపోతే మిగతా ఆ 25 శాతం సొమ్మునూ ఉపసంహరించుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్.. మీ ఉద్యోగ కాలం, ఇతరత్రా ఆదాయ వనరుల ఆధారంగా వర్తించే పన్నులకు లోబడి ఉంటాయి.
ఐదేండ్లు కాకముందే మీ పీఎఫ్ ఖాతా నుంచి సొమ్మును తీసుకోవాలనుకుంటే పన్నులు వర్తిస్తాయి. అలా కాకుండా ఫామ్ 31 ద్వారా మీ పాత సంస్థ నుంచి కొత్త సంస్థలోకి ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకుంటే కొంత కాలం తర్వాత సీనియారిటీ పెరిగి పన్నుల నుంచి తప్పించుకోవచ్చు. మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలతో మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జత చేసుకుంటే ఆన్‌లైన్ విత్‌డ్రాయల్స్ సులభతరంగా ఉంటాయి.
ఆన్‌లైన్‌లో మీ ఈపీఎఫ్ ఉపసంహరణ ఇలా..
- తొలుత యూఏఎన్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి మీ యూఏఎన్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
- ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, మీకు అవసరమైన ఈపీఎఫ్ అడ్వాన్స్ విత్‌డ్రాయల్ ఫామ్‌ను పొందడానికి డ్రాప్-డౌన్ మెనూ నుంచి ‘క్లెయిమ్ (ఫామ్-31, 19, 10సీ, 10డీ)’ ఎంచుకోండి
- స్క్రీన్‌పై మీ సభ్యత్వ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతా నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను ఎంటర్ చేసి, ‘వెరిఫై’పై క్లిక్ చేయండి. ఆపై మరింత ముందుకెళ్లేందుకు ‘యెస్’పై క్లిక్ చేయండి.
- ‘ఆన్‌లైన్ క్లెయిమ్ కోసం ప్రొసీడ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- కొద్దిమేరకే నిధుల్ని తీసుకోవాలనుకుంటే ‘పీఎఫ్ అడ్వాన్స్ (ఫామ్ 31)’ను ఎంచుకోండి.
- ఓ కొత్త ఫామ్ తెరుచుకుంటుంది. అందులో మీ అవసరాన్ని తెలియజేయాలి.
- సర్టిఫికేషన్‌పై టిక్ చేసి, మీ దరఖాస్తును సమర్పించాలి.
- ఈ సందర్భంగా మీరు నింపిన ఈపీఎఫ్ క్లెయిమ్ ఫామ్‌లో వివరాలకు అనుగుణమైన ధ్రువపత్రాలను జత చేయాల్సి రావచ్చు.
- ఒక్కసారి మీ విత్‌డ్రాయల్ విజ్ఞప్తి ఆమోదం పొందితే, మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు మీరు సూచించిన బ్యాంక్ ఖాతాలో 15-30 రోజుల్లో జమవుతుంది.
- ఈ మేరకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.
COMMENTS