CBI: 3,000 Apprentice Vacancies in Central Bank of India.
CBI: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,000 అప్రెంటిస్ ఖాళీలు.
Central Bank of India Recruitment: ముంబయి ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్(రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్) సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా పలు రీజియన్లలోని శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3 వేల అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి 100 పోస్టులు, తెలంగాణకు 96 పోస్టులు కేటాయించారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులకు మార్చి 10న ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఖాళీల సంఖ్య: 3,000.
➥ ఆంధ్రప్రదేశ్‌లో 100 ఖాళీలు (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30).
➥ తెలంగాణలో 96 ఖాళీలు (హైదరాబాద్- 58, వరంగల్- 38)
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.600; దివ్యాంగులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్; బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్; బేసిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
స్టైపెండ్: నెలకు రూరల్/ సెమీ అర్బన్ శాఖలు రూ.15,000. పట్టణ శాఖలు రూ.15,000. మెట్రో శాఖలు రూ.15,000.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.02.2024.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.03.2024.
➥ ఆన్‌లైన్ పరీక్ష తేది: 10.03.2024.
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS