Camel: Antidote for snake bite with camel tears.. Here are the details
Camel: ఒంటె కన్నీటితో పాము కాటుకు విరుగుడు.. ఇవిగో వివరాలు
సాధారణంగా పాములన్నీ విషపూరితాలు కావు. కొన్ని మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవి. కట్ల పాము, రక్త పింజర, తాచుపాము వంటివి కాటు వేసినప్పుడు నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే మెడిసిన్ తయారీకి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటుతో లక్షలమంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా పాముకాటుకు ఒంటె కన్నీరుతో ఔషధాన్ని తయారుచేసేందుకు సిద్ధమయ్యారు దుబాయ్ శాస్త్రవేత్తలు.
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు స్పీడ్‌గా సాగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. ఈ ల్యాబ్‌లో ఒంటెన్నీరుపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా కొనసాగించలేకపోయారు. తాజాగా ఫండ్స్ సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని CVRL తెలిపింది. త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే మెడిసిన్ తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం చీఫ్ డాక్టర్ వార్నర్ వెల్లడించారు.
ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు, లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, భారత్, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వీరి పరిశోధనలు ఫలించి ఔషధాన్ని మార్కెట్‌లోకి తెస్తే పాము కాటు మరణాలు చాలా వరకు అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
COMMENTS