Bharat Rice: Thin rice for Rs.29 per kg.. Where to buy this 'Bharat Rice'?
Bharat Rice: రూ.29కే కిలో సన్న బియ్యం.. ఈ 'భారత్ రైస్' ఎక్కడ కొనాలి?
Bharat Rice: దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో సన్న బియ్యం రూ. 29 కే అందించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన వారు సంతోషపడుతున్నప్పటికీ ఎక్కడ కొనాలి? ఎలా కొనుగోలు చేయాలనే విషయంపై వారికి క్లారిటీ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే వారం నుంచి బియ్యం విక్రయాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో మధ్య తరగతికి ఊరట నిస్తుందన్నారు.
ఈ బియ్యం ఎక్కడ విక్రయిస్తారు?
భారత్ రైస్ పేరిట రూ.29కే కిలో సన్న బియ్యం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో విక్రయించనుంది. అలాగే ఇ- కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు సంజీవ్ చోప్రా. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తామని తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్ర నిర్ణయించినట్లు వెల్లడించారు.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి కిలో రూ. 27.50, భారత్ దాల్ శనగ పప్పును కిలోకు రూ. 60 చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ' భారత్ రైస్‌ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్లి కొనుగోలు చేయవచ్చు. అలాగే త్వరలోనే ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్ లోకి అందుబాటులోకి తీసుకొస్తాం. దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతోంది. రోజు వారీ స్టాక్ వివరాలను ట్రేడర్లు, వోల్ సేలర్స్, రిటైల్స్, బిగ్ చైన్ రిటైల్స్, ప్రాసెసర్స్, మిల్లర్లు వెల్లడించాలని ఆదేశించింది కేంద్రం. ' అని తెలిపారు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా. మరోవైపు.. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు చోప్రా. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేదం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పంపిణీ కేంద్రాలు..
ఏపీ రైస్ స్టోర్స్, మెట్టుగూడ.
చంద్రమౌళి ట్రేడర్స్, కార్వాన్.
ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్,
ఎస్‌ఆర్‌నగర్.
డింగ్‌డాంగ్ సూపర్ మార్కెట్.
గౌతమ్‌రైస్ డిపో, కాప్రా.
జై తుల్జాభవానీ ఏజెన్సీ, లంగర్‌హౌజ్.
మాణిక్య ట్రేడర్స్, ఆర్‌కే పురం.
మురళీ కిరణ్ అండ్ జనరల్ స్టోర్స్, పటాన్‌చెరువు.
ముత్తయ్య గ్రాండ్ బజార్, శేరిలింగంపల్లి.
ఖైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్, హైదరాబాద్.
సాయిదీప్ సూపర్ స్టోర్స్, మెదక్.
సిర్వి ట్రేడర్స్, బోడుప్పల్.
శంకర్ ట్రేడింగ్ కంపెనీ, సికింద్రాబాద్.
శ్రీ గోవిందా ట్రేడర్స్, కాచిగూడ.
శ్రీ వీరభద్ర ట్రేడర్స్, కవాడిగూడ.
శ్రీ అంబ ట్రేడర్స్, హైదరాబాద్.
శ్రీ బాలాజీ రైస్ డిపో, రాంనగర్.
శ్రీ సాయిబాబా రైస్ డిపో, కార్వాన్.
సాయిశివ రైస్ ట్రేడర్స్, కర్మన్‌ఘాట్.
శ్రీ సాయి ట్రేడర్స్, కొత్తపేట.
శ్రీ ట్రేడర్స్, చందానగర్.
ఉజ్వల్ ట్రేడర్స్, మల్లేపల్లి.
ఉప్పు రాజయ్య ట్రేడర్స్, షాపూర్‌నగర్.
రిలయన్స్, దేవరయంజాల్.
COMMENTS