ATM Fraud: Making these mistakes when going to the ATM? Your bank is empty..!
ATM Fraud: ఏటీఎంకు వెళ్లినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాళీయే..!
ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. అలాగే బ్యాకింగ్, ఏటీఎం తదితర వాటిలో అధికంగా మోసాలు జరుగుతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే బ్యాంకు, ఏటీఎంల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు టెక్ నిపుణులు. ఎక్కువగా మోసాలు జరిగేది ఏటీఎం, ఆన్‌లైన్ సైట్లలోనే. ఇక నగదు అవసరమైనప్పుడు వెంటనే బ్యాంకుకు పరుగులు తీయడం సాధ్యం కాదు. డబ్బును ఉపసంహరించుకోవడానికి సులభమైన పద్ధతులు, మార్గాలలో ఒకటి ATM. షాపింగ్ మాల్స్, బస్టాండు ప్రాంతాల్లో, ఇతర మాల్స్, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌ల వరకు ప్రతిచోటా ఏటీఎంలు ఉన్నాయి. అయితే, ఏటీఎంలలో డబ్బు తీసుకునే సౌలభ్యం ఉండడంతో ఏటీఎం మోసాల ప్రమాదం కూడా కాలక్రమేణా పెరుగుతోంది. స్కానర్‌లను ఇన్‌స్టాల్ చేయడం, ఏటీఎం పిన్‌లను దొంగిలించడం ద్వారా మోసగాళ్ళు తక్షణమే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు. పెరుగుతున్న ఈ మోసాన్ని నివారించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏటీఎంలలో విత్ డ్రా చేసే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా మోసపోయే ప్రమాదం ఉందంటోంది.
భారతీయ సైబర్‌స్పేస్ భద్రతకు బాధ్యత వహించే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CERT-IN, ATM మోసాలను నిరోధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇటీవల X హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఏటీఎం మోసం జరగకుండా జాగ్రత్త పడండి’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చింది. అపరిచిత వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇవ్వొద్దు. మీ PIN, CVV లేదా OTPని ఎవరికీ ఇవ్వకండి అని సూచించింది.
ఏటీఎం మోసం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఎలాంటి సెక్యూరిటీ లేని ఏటీఎంలలోకి వెళ్లవద్దు.
- సీసీ కెమెరాలు ఉన్న ఏటీఎంలలోకి మాత్రమే వెళ్లండి.
- ఏటీఎంలో పిన్ నంబర్ ఎంటర్ చేసే ముందు ఎవ్వరు చూడకుండా చేతితో కవర్ చేయండి.
- మీ ఏటీఎం పిన్ నంబర్‌ను మీ పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటివి పెట్టుకోవద్దు.
- ఏటీఎంలో విత్‌డ్రా చేసేటప్పుడు తెలియని వ్యక్తుల సహాయం అడగవద్దు.
- డబ్బు తీసుకునే ముందు ఏటీఎంలో స్కానర్ ఉందో లేదో చూసుకోండి.
- బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.
- మీకు తెలియని వారికి పిన్, CVV లేదా OTPని షేర్ చేయవద్దు.
- ఆన్‌లైన్ సైట్‌లో కార్డ్ వివరాలను నమోదు చేసే ముందు, ఆ సైట్ నమ్మదగినదా కాదా అని తనిఖీ చేయండి.
COMMENTS