AP DSC 2024 : AP DSC application deadline extension.. opportunity to correct mistakes
AP DSC 2024 : ఏపీ డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు.. తప్పుల సవరణకు అవకాశం.
AP DSC Recruitment 2024 : ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగిస్తూ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..
AP DSC 2024 Application Date Extended : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏపీ డీఎస్సీ (AP DSC 2024) పరీక్షకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించారు. ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 21వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ఏపీ డీఎస్సీకి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారని విద్యాశాఖ ప్రకటించింది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
అలాగే.. దరఖాస్తు చేసే సమయంలో చేసిన తప్పుల్ని సవరించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మొదట అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో డిలీట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం పాత జర్నల్ నంబర్‌తో, అభ్యర్థి మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్‌ను పొందొచ్చు. తద్వారా ఎలాంటి ఫీజు చెల్లించకుండా తప్పులు సరిదిద్ది అప్లపికేషన్‌ను మళ్లీ సమర్పించుకోవచ్చు. అభ్యర్థి పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలను మార్చుకోవచ్చు. అలాగే.. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ మార్చుకోవాలంటే పరీక్ష కేంద్రంలో నామినల్స్ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6,100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి.. ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేయనున్నారు.
COMMENTS