Aadhaar can be registered even without fingerprints.. how..?!
ఫింగర్ ప్రింట్స్ లేకున్నా ఆధార్ నమోదు చేసుకోవచ్చు.. ఎలాగంటే..?!
Aadhar:ఫింగర్ ప్రింట్స్ ఇవ్వలేని వారు తమ ఐరిస్ స్కాన్ సాయంతో ఆధార్ నమోదు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆధార్ సేవా కేంద్రాలకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు.
Aadhar | ఇప్పుడు బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా, పాన్ కార్డు తీసుకోవాలన్నా.. ఏదైనా ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు కోసం ప్రతి ఒక్కరి నుంచి ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అయితే, కొందరు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వలేకపోవచ్చు. అటువంటి వారు ఐరిస్ (Iris) ద్వారా ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకోవచ్చునని కేంద్రం ఆదేశించింది. ఆధార్ కార్డు జారీకి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కేరళలో పీ జోస్ అనే మహిళకు చేతి వేళ్లు లేకపోవడంతో ఆధార్ కార్డు పొందలేకపోయింది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రియాక్టయ్యారు. అంగ వైకల్యం ఉన్నా, వేలి ముద్రలు సరిగ్గా పడకపోయినా, బయో మెట్రిక్ కోసం ఐరిస్ ఆధారంగా ఆధార్ కార్డు జారీ చేయాలని తెలిపారు. బయో మెట్రిక్ ఆధారాలు సమర్పించడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆధార్ కార్డు జారీ చేయాలని దేశంలోని ఆధార్ సేవా కేంద్రాలకు సూచనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) సిబ్బంది.. సదరు పీ జోస్ ఇంటికెళ్లి ఆమెకు ఆధార్ కార్డు జారీ చేసినట్లు తెలిపింది.
ఇంతకుముందే ఐరిస్, వేలి ముద్రలు సమర్పించలేని వారిలో అర్హులకు ఆధార్ కార్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. ఈ రెండు ఆధారాలు సమర్పించలేని వారు.. అందుకు కారణాలు తెలుపుతూ ఫోటో ద్వారా నమోదు చేసుకోవచ్చు.
COMMENTS