2140 constable posts in BSF. 10, ITI qualification per month Rs. Salary up to 69000
బీఎస్ఎఫ్ లో 2140 కానిస్టేబుల్ పోస్టులు..10,ఐటీఐ అర్హతతో నెలకు రూ. 69000 వరకు జీతం.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో 2140 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో 2140 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో 1723 పోస్టులు పురుషుల కోసం రిజర్వ్ చేయబడగా..417 పోస్టులు మహిళల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి తమ డాక్యుమెంట్స్ ని సిద్ధంగా ఉంచుకోవాలి.
విద్యార్హత:
ఈ BSF రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ. 100
SC/ST/ESM/మహిళల అభ్యర్థులకు రుసుము లేదు
ఎంపిక ప్రక్రియ:
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST): ఇందులో 1 మైలు పరుగు, హై జంప్, లాంగ్ జంప్ వంటి టెస్ట్ లు ఉంటాయి.
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ): ఇందులో ఎత్తు, బరువు, ఛాతీ కొలతలను చెక్ చేస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- ట్రేడ్ టెస్ట్
- రాత పరీక్ష
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం:
కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతనం రూ.21,700 నుండి రూ.69,100 వరకు ఇవ్వబడుతుంది. ప్రభుత్వ విధానాల ప్రకారం అలవెన్సులు మరియు ప్రయోజనాలు కూడా చేర్చబడ్డాయి.
Important Links:
FOR SHORT NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS