TS Model School Notification 2024: Notification for admissions in 6th-10th classes in Telangana Model Schools.. Application Process Begins
TS Model School Notification 2024: తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6- 10వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరో తరగతిలో ప్రవేశాలతోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలి ఉన్న సీట్లు భర్తీ కానున్నాయి. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. 6వ తరగతిలో అడ్మిషన్ పొందగోరే విద్యార్ధులు 2023-24 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి చదువుతూ ఉండాలి. మిగలిన విద్యార్ధులు 7వ, 8వ, 9వ తరగతులు చదువుతూ ఉండాలి. ఆగస్టు 31, 2024 నాటికి ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి పదకొండేళ్లు, ఎనిమిదో తరగతిని పన్నెండేళ్లు, తొమ్మిదో తరగతి పదమూడేళ్లు, పదో తరగతికి పద్నాలుగేళ్లు నిండి ఉండాలి. ఆసక్తి కలిగిన బాలికలు ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.125, ఇతరులకు రూ.200ల చొప్పున పరీక్ష రుసుము చెల్లించవల్సి ఉంటుంది. తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ద్వారా ఎంపిక ఉంటుంది.
ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రతి తరగతికి రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌కు 50 మంది చొప్పున మొత్తం 100 సీట్లు ఉంటాయి. ప్రవేశాలు పొందిన విద్యార్ధులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా ఇస్తారు. ప్రతి తరగతిలో జనరల్ విద్యార్థులకు 50 శాతం సీట్లను, బీసీలకు 29 శాతం సీట్లను, ఎస్సీలకు 15 శాతం సీట్లను, ఎస్టీ విద్యార్థులకు 6 శాతం సీట్లను కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష విధానం..
తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు గానూ 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్/ తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 12, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2024.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 1, 2024.
తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 తేదీ: ఏప్రిల్ 7, 2024.
ఫలితాల వెల్లడి తేదీ: మే 25, 2024.
అడ్మిషన్ తేదీలు: మే 27 నుంచి 31 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS