Success Story: Srishti Deshmukh IAS.. that name is a sensation.. then in civils.. now in social media
Success Story: సృష్టి దేశ్‌ముఖ్ ఐఏఎస్.. ఆ పేరే ఒక సెన్సేషన్.. అప్పుడు సివిల్స్‌లో.. ఇప్పుడు సోషల్ మీడియాలో..
కెరీర్ ప్రారంభంలో ఎదురు దెబ్బలు తిని.. కూడా విజయతీరాలకు చేరింది. సివిల్స్ మొదటి ప్రయత్నంలో ఏకంగా ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించింది. ఆమె ఎవరో కాదు ఐఏఎస్ ఆఫీసర్ సృష్టి దేశ్‌ముఖ్. ఇంజినీరింగ్ పట్టభద్రురాలు అయినప్పటికీ సివిల్స్ ని మొదటి ప్రయత్నంలో ఛేదించి కలెక్టర్ అయిన ఆమె ప్రస్థానం నిజంగా అభినందనీయం
సోషల్ మీడియాలో ఆ అధికారి చాలా ఫేమస్.. ఆమె పనితీరుకు నెటిజనులు ఫిదా అయిపోతుంటారు. సమస్యలపై తాను వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజలతో సన్నిహితంగా ఉంటూనే.. పనిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా కఠినంగా ఉంటారు. దీంతో ప్రజల్లో కూడా ఆమెకు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా మంచి పేరు వచ్చింది. అయితే ఆమె ప్రయాణం మొదటి నుంచి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో ఎదురు దెబ్బలు తిని.. కూడా విజయతీరాలకు చేరింది. సివిల్స్ మొదటి ప్రయత్నంలో ఏకంగా ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించింది. ఆమె ఎవరో కాదు ఐఏఎస్ ఆఫీసర్ సృష్టి దేశ్‌ముఖ్. ఇంజినీరింగ్ పట్టభద్రురాలు అయినప్పటికీ సివిల్స్ ని మొదటి ప్రయత్నంలో ఛేదించి కలెక్టర్ అయిన ఆమె ప్రస్థానం నిజంగా అభినందనీయం. కలెక్టర్ సృష్టి దేశ్ ముఖ్ సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..
జేఈఈలో విఫలం..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సృష్టి.. భోపాల్‌లోని బీహెచ్ఈఎల్లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె 12వ బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ 93.4% సాధించారు. ఆ తర్వాత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) రాసింది. అయితే దానిలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చదవాలనే ఆమె కల కలగానే మిగిలిపోయింది. అయితే అక్కడితో ఆగిపోకుండా, అధైర్యపడకుండా, ఆమె భోపాల్‌లోని లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. అక్కడ ఆమె కెమికల్ ఇంజినీరింగ్‌ను అభ్యసించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయిన తర్వాత, యూపీఎస్‌సీ పరీక్షలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సృష్టి నిర్ణయించుకున్నారు. జేఈఈ ఉత్తీర్ణత సాధించలేకపోయిన నిరాశ చెందిన సృష్టిని ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తన తండ్రి ఇంజినీర్, తల్లి టీచర్ కూడా బాగా ప్రోత్సహించారు. దీంతో సృష్టి తన యూపీఎస్‌సీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ధృడ సంకల్పంతో ప్రారంభించిన ఆమె తన మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఏకంగా ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సాధించారు.
అందరికీ స్ఫూర్తి..
ఆమె సాధించిన విజయాలకు అదనంగా, సృష్టి అదే బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున్ బి. గౌడను వివాహం చేసుకున్నారు. స్థిత ప్రజ్ఞత, దృఢ సంకల్పం తో పాటు ప్రారంభ దశలోనే ఎదురైన ఎదురుదెబ్బలను తట్టుకుని విజయాన్ని తన పరం చేసుకున్నారు. ప్రస్తుతం ఔత్సాహిక యువతకు ఐఏఎస్ సృష్టి దేశ్ ముఖ్ ఒక మార్గదర్శి కాగలరు. మొదటి మెట్టులోనే పడిపోయినా.. కష్టపడి తర్వాత అందుకున్న విజయం ఎందరికో స్ఫూర్తి దాయకం. ప్రతికూలతలను కూడా విజయానికి సోపాలుగా మార్చుకున్న ఆ ప్రస్థానం అనుసరణీయం.
COMMENTS